సినిమాల్లో నాలుగుసార్లు నేషనల్ అవార్డు అందుకున్న కమల్ హాసన్. 1960లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు. బాలనటుడిగా ‘కళత్తూర్ కన్నమ్మ’ సినిమాకు రాష్ట్రపతి గోల్డ్ ఫిల్మ్ అవార్డును కూడా అందుకున్నాడు. అప్పటి నుంచి అతడి కెరీర్ ఎక్కడా ఆగకుండా సాగింది. అయితే కమల్ కెరీర్ తొలినాళ్లలో మొదట నటి శ్రీవిద్యతో ప్రేమాయణం కొనసాగించారు.
అతని కంటే రెండేళ్లు పెద్దదైన శ్రీవిద్యతో కమల్ హాసన్ చాలా సినిమాల్లో నటించారు.వీరి మధ్య రిలేషన్ చాలా సంవత్సరాలు సాగింది. ఆ తర్వాత కూడా ఆయన పలువురితో రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు. ముఖ్యం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖతో కొన్నాళ్లు కమల్ హాసన్ డేటింగ్ చేశారు.రేఖకు తమిళ సినీ పరిశ్రమ నుంచి ఒక అద్భుత అవకాశం తలుపుతట్టింది – అదే ‘మీండమ్ కోకిల’ సినిమా.

ఈ చిత్రంలో నటనకు అగ్ర తారలు కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో ఉన్నారు. ‘మీండమ్ కోకిల’ షూటింగ్‌లో రేఖ పాల్గొన్నప్పుడు, సెట్‌లో కమల్ హాసన్, ఆమె మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడిందనే పుకార్లు షికారు చేశాయి. ఒకరోజు వీరిద్దరు కలిసి ఓ హోటల్ గదిలో ఉండగా, కమల్ భార్య వాణి గణపతి అక్కడకు వెళ్లి పెద్ద గొడవ చేశారట.
ఈ ఇన్సిడెంట్ తర్వాత కొన్ని వారాలకే రేఖను ఆ మూవీ నుంచి తీసేశారని.. ఆమె పాత్రను మలయాళ నటి దీప (ఉన్ని మేరీ)కు ఇవ్వడం జరిగింది. ఈ గొడవ జరిగిన కొద్ది రోజలకే వాణి గణపతి కమల్ హాసన్‌కు విడాకులిచ్చారు. ఈ ఘటన తర్వాత రేఖ సైతం కమల్‌కు దూరంగా ఉన్నారు.