చేతి వేళ్ల ఆకారంలో ఉండే ఈ పండు తింటే చాలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన రోగాలు వెంటనే తగ్గిపోతాయి.

divyaamedia@gmail.com
2 Min Read

బుద్ధ హస్తం ఫ్రూట్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా విటమిన్ సితోపాటు ఫైబ‌ర్‌, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ పండు తింటే అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, విరేచ‌నాలు, క‌డుపు నొప్పి వంటి సమస్యలకు చిటికెలో చెక్ పెట్టొచ్చు. దీనికి ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్లు వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటాయి. మీ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అయితే ఈ బుద్ధ హస్తం పండులో ఫ్లేవ‌నాయిడ్స్‌, కౌమ‌రిన్స్‌, విట‌మిన్ సి ఉంటాయి.

ఇవ‌న్నీ యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా ప‌నిచేస్తాయి. శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, వాపులు త‌గ్గిపోతాయి. గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్లు, వ‌యస్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే రోగాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు. నొప్పుల‌ను త‌గ్గించేందుకు ఈ పండును ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ఈ పండులో విట‌మిన్ సి పుష్కలంగా ఉండి, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తుంది.

దీంతో శ‌రీరం ఇన్ఫెక్ష‌న్లు, వ్యాధుల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. దీని వ‌ల్ల సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. హైబీపీ ఉన్న‌వారికి ఈ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. స్త్రీలు రుతు స‌మ‌యంలో ఈ పండ్ల‌ను తింటే ప‌లు ర‌కాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. రుతు స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పి త‌గ్గిపోతుంది. ఈ పండులో కౌమారిన్‌, లైమోనిన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి అనాల్జెసిక్ ల‌క్ష‌ణాలను క‌లిగి ఉంటాయి.

అందువ‌ల్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. వాపుల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపుల‌ను త‌గ్గించుకోవ‌చ్చునని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గిపోతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *