ఆంటీ రేంజ్ మారిపోయిందిగా..! ఇప్పుడు కుమారి ఆంటీ ఏం చేస్తుందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

సోషల్ మీడియా ఆమెను భారీగా ప్రమోట్ చేయడంతో కుమారికి గిరాకీ పెరిగింది. దీంతో ఆ రాబడి కూడా పెరిగింది. పేద మహిళ ఫుడ్ కోర్టు పెట్టుకుని నడుపుకుంటున్నారు. మంచిదే.. కానీ ఆమె షాపు వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆ రూట్ లో వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే చివరకు ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ఆమె ఫుడ్ స్టాల్‌ను అధికారులు తీసేస్తే సీఎం కూడా స్పందించాల్సి వచ్చింది.

ఆఖరికి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఫేమస్ టీవీ షోలు కూడా కుమారి ఆంటీ క్రేజ్ ను వాడుకున్నాయి. అలాగే బిగ్ బాస్ షోలోనూ పాల్గొంటారని వార్తలు వచ్చినా అవి రూమర్లు గానే మిగిలిపోయాయి. అయితే ఈ మధ్యన కాస్త సైలెంట్ అయిన కుమారి ఆంటీ మళ్లీ వార్తల్లో నిలిచింది. సినిమా టీం కూడా ఆమె క్రేజ్‌ను వాడుకున్నారు. ఇందులో భాగంగా నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న షో టైం మూవీ టీం కుమారీ ఆంటీని తీసుకు వచ్చి ప్రమోషనల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు.

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం షో టైమ్. మధన్ కుమార్ ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా కుమారి ఆంటీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

‘కుమారి ఆంటీని సెలబ్రిటీ చేశారు’, ‘అంతా సోషల్ మీడియా మహత్యం’ అంటూ నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అదే సమయంలో ఆమె ఫుడ్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *