సత్య దేవరాజన్.. ఈ బ్యూటీ ఎన్నో సీరియల్స్లో నటించి మెప్పించింది. అలాగే అందం, అభినయంతో ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సీరియల్స్ చేస్తూ అలరిస్తు ఉంది. ఈ క్రమంలో ఈ చిన్నదికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అందం, అభినయంతో హీరోయిన్స్ కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది.
ఇప్పుడు ఈ అమ్మడు ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ పైన ఫోటోలో ఇటుకలు మోస్తూ కనిపిస్తున్న బ్యూటీ బుల్లితెరపై చాలా ఫేమస్. ఒకప్పుడు అనేక సీరియల్స్ చేసి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..కోలీవుడ్ నటి సత్య థెరాజన్. సాధారణంగా సినిమాల్లో తమ పాత్ర కోసం హీరోయిన్స్ ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు ముందుంటారు. తమ ఫిట్నెస్ విషయంలో అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
అలాగే పాత్ర, కథ డిమాండ్ బట్టి తమ లుక్ పూర్తిగా మార్చుకునేందుకు ట్రై చేస్తుంటారు. ఇక ఇప్పుడు ఓ సీరియల్ హీరోయిన్ సైతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఇలా భవన నిర్మాణ కార్మికురాలిగా మారింది. తనే టీవీ నటి సత్య థెరాజన్. కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. తాజాగా తన ఇన్ స్టాలో సెట్ లో తాను భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసేందుకు రెడీ అవుతున్న వీడియో షేర్ చేసింది.
ఇప్పుడు అదే వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమిళంలో ప్రసారమయ్యే ధనం సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది సత్య. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. చిన్న మరుమకలు అనే సీరీస్‌కి దర్శకత్వం వహించిన మనోజ్ కుమార్ ఈ సీరియల్ కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆటో నడిపించే తన భర్త మరణంతో కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది సత్య.