ఎన్టీఆర్ పక్కన నటించానని మూడుసార్లు రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్. ఎందుకో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఎంతో కష్టమైన స్టెప్స్‌ను సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవలే ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి కామెంట్స్ చేశారు. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండానే ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇవే కాకుండా మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో దేవర 2 షూటింగ్ సైతం త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తారక్ అప్ కమింగ్ మూవీస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్ సరసన నటించాలని చాలా మంది హీరోయిన్స్ అనుకుంటారు. తారక్ సరసన నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు.

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ సైతం తారక్ జోడిగా కనిపించాలని కోరుకుంటున్నారు. కానీ మీకు తెలుసా.. ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే.. ఓ హీరోయిన్ ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసిందట. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ అలియా భట్. ఆమెకు మూడుసార్లు ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ వస్తే.. పలు కారణాలతో ఆ అవకాశాన్ని వదిలేసుకుందట. వీరిద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించారు. కానీ అందులో రామ్ చరణ్ జోడిగా కనిపించింది.

అయితే దేవర సినిమాలో తారక్ జోడిగా అలియా నటించాల్సి ఉందని.. కానీ అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ ఛాన్స్ కోల్పోయిందట. ఆ తర్వాత మరోసారి తారక్ సినిమా కోసం సంప్రదించగా.. మరో సినిమాతో బిజీగా ఉండడంతో వీలు కాలేదట. అలా వివిధ కారణాలతో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ మూడు సార్లు కోల్పోయింది. దేవర చిత్రంలో ఎన్టీఆర్ జోడిగా జాన్వీ కపూర్ కనిపించింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *