నేటి కాలం చాలా మంది ఇన్పెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు అన్ని విషయాలపై కూడా అవగాహన ఉండాలి. పిల్లలు కావాలనుకునేవారు దానికోసం సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుడ్, డైట్ సరిగ్గా తీసుకుంటూ ఒత్తిడి తగ్గించుకోవాలి. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మగవారిలో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కారణంగా సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనిని తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రుషులలో స్పెర్మ్ కౌంట్ నిరంతరం తగ్గుతోంది.
దీంతో పురుషులు తండ్రి అయ్యే ఆనందాన్ని పొందలేకపోతున్నారు. వాస్తవానికి చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే దీనికి కారణాలు కావు. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం… ఎవరైనా ల్యాప్‌టాప్‌ను తమ ఒడిలో ఉంచుకుని పని చేస్తుంటే.. వీలైనంత త్వరగా ఈ అలవాటును మార్చుకోండి. వాస్తవానికి, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి గాలి స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను టేబుల్‌పై మాత్రమే ఉంచి పని చేయడానికి ప్రయత్నించండి.
వృషణాల ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ఈ సమస్య రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం
చాలా మంది పురుషులు బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. నిజానికి ఈ అలవాటు కూడా తక్కువ స్పెర్మ్ కౌంట్ కు ఒక పెద్ద కారణంగా పరిగణించబడుతుంది. బిగుతుగా ఉండే లోదుస్తులు వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీని కారణంగా స్పెర్మ్ ఉత్పత్తి అవ్వదు. వదులుగా ఉండే లోదుస్తులను మాత్రమే ధరించడానికి ప్రయత్నించండి.
ధూమపానం, మద్యపానం..ధూమపానం లేదా మద్యపానం చేసే అలవాటు ఉన్న పురుషులలో కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ఈ అలవాట్లు స్పెర్మ్ ఆరోగ్యానికి మంచిది కాదు. స్పెర్మ్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది. దీనితో పాటు మద్యపానం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది అంగస్తంభన పనిచేయకపోవడానికి కారణమవుతుంది.స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఒత్తిడిని తీసుకోవడం..పురుషులు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటే.. వారి శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది.
ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించడమే కాదు దాని నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. ఫోన్ జేబులో పెట్టుకునే అలవాటు..చాలా మంది తమ మొబైల్ ఫోన్లను ప్యాంట్ జేబుల్లో ఉంచుకుంటారు. అలాంటప్పుడు ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. కనుక వీలైంత వరకూ సెల్ ఫోన్ ని ఫ్యాంట్ జేబు నుంచి తీసి ఫోన్‌ను బ్యాగ్‌లో ఉంచుకోవడం అలవాటు చేసుకోండి.
ఏ అలవాట్లు మంచివంటే..స్పెర్మ్ ఆరోగ్యంగా ఉండటానికి రాత్రి సముయంలో మంచి నిద్ర చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి. ఒత్తిడికి గురికావద్దు. రోజూ ధ్యానం చేయడం కూడా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఎత్తుకు తగిన బరువును నిర్వహించండి.