వరుస విషాదాలు, అవకాశాలు లేక వాచ్‌మెన్‌గా మారిన న‌టుడు..! సాయం కోసం ఎదురు చూపు.

divyaamedia@gmail.com
1 Min Read

ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చినవారే. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, నాని, శివకార్తికేయన్, లాంటి నటులుు ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్టార్స్ అయ్యారు. అదే విధంగా అజిత్ కూడా సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి తన ప్రతిభతో ఎదిగారు. నటుడిగానే కాకుండా స్పోర్ట్స్‌లో కూడా రాణిస్తున్నారు.

అయితే అయితే అవేమి ఆయ‌న కెరీర్‌కి ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సినిమా అవకాశాలు రాక, కుటుంబం నుండి కూడా దూరమైన సవి సింధు, ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే సవాలుగా మారిందని, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలన్న చిన్న కోరికను కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సినీ పరిశ్రమలో చాలామంది స్టార్‌లు బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఎదిగారు. చిరంజీవి, రజినీకాంత్, నాని, శివకార్తికేయన్, అజిత్ లాంటి వారు వారి ప్రతిభతో స‌త్తా చాటారు. అజిత్ విషయానికి వస్తే, నటనతో పాటు కార్ రేసింగ్‌లోనూ ఆయన టాలెంట్‌ చూపిస్తూ, ఇటీవలే పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు. అయితే, అజిత్ సినిమా ‘ఆరంభం’లో నటించిన ఈ నటుడు మాత్రం, జీవితంలో వెనుకబడిపోయాడు.

“ఒకప్పుడు సినిమాల్లో నటించాను, కానీ ఇప్పుడు కేవలం బతకడానికే పోరాటం చేస్తున్నాను” అని అంటున్న సవి, బాలీవుడ్‌ సెలబ్రిటీల నుంచి సహాయం అందుతుందేమో అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీ వాళ్లు కాక‌పోయిన ఎవ‌రైన స‌రే మాన‌వ‌త్వంతో ఆయ‌న‌కి ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *