చిరంజీవికి లవర్‌గా, తల్లిగా, భార్యగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్..! ఆమె ఎవరో తెలిస్తే..?

divyaamedia@gmail.com
1 Min Read

చిరంజీవి సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, ఒకే నటి ఆయనతో వివిధ విధమైన పాత్రల్లో సహకరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.సీనియర్ నటి సుజాత, చిరంజీవి సినిమాల్లో అక్కగా, ప్రేయసిగా, భార్యగా, తల్లిగా, ఇలా వివిధ పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్‌లో మన బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మెగాస్టార్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన కెరీర్‌లో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి.. ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఒకప్పటి హీరోయిన్స్ మాత్రమే కాదు.. ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు సైతం చిరుతో ఆడిపాడారు. అయితే వీరిలో ఒక్క హీరోయిన్ చిరంజీవికి అక్కగా, లవర్‌గా, తల్లిగా, భార్యగా.. ఇలా అనేక పాత్రల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.? మరెవరో కాదు సీనియర్ నటి సుజాత.

తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 300కిపైగా చిత్రాల్లో నటించిన నటి సుజాత.. మొదటిగా హీరోయిన్‌గా ఆ తర్వాత అక్క, వదిన, అమ్మ వంటి పాత్రల్లో నటించింది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ప్రేమ తరంగాలు’ మూవీలో చిరంజీవికి లవర్‌గా నటించి మెప్పించింది సుజాత. ఇక ఈ సినిమా చివర్లో వీరికి వివాహం జరుగుతుంది. ఇలా సుజాత చిరంజీవికి భార్యగా నటించి ఆకట్టుకుంది.

ఆ తర్వాత 1982లో ‘సీతాదేవి’ అనే మూవీలో సుజాత చిరంజీవికి చెల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఇక 1995లో ‘బిగ్‌బాస్’ మూవీలో సుజాత చిరంజీవికి తల్లిగా నటించింది. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేదు. కాగా, ఇప్పటివరకు చిరంజీవికి తల్లిగా, లవర్‌గా, భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ సుజాత కావడం విశేషం. సుజాత తన చివరి రోజుల వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇక ఆమె 2011, ఏప్రిల్ 6న కన్నుమూశారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *