ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..! గుండె పోటు కాదు.. ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్.. డెత్ మిస్టరీ ఏమైనా ఉందా..?

divyaamedia@gmail.com
2 Min Read

బాలీవుడ్ నటి షఫాలీ జరీవాలాకు గుండె పోటు వచ్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏడెనిమిదేళ్లుగా ఆమె ఈ మందులు వాడుతున్నట్టు గుర్తించారని సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం, నటి మృతికి సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రశ్నించారు. అయితే మొన్న రాత్రి ఆమెకు గుండె పోటు రాగానే భర్త పరాగ్ త్యాగి ఆమెను బెల్లెవ్యూ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. హాస్పిటల్ కి తీసుకొచ్చేలోపే ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

దీంతో కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త పరాగ్ త్యాగి హాస్పిటల్ నుండి బయటకు వెళ్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. భర్తతో పాటు షెఫాలీ జరివాలా స్నేహితులు, సన్నిహితులు కూడా హాస్పిటల్ ఆవరణలో కనిపించిన విజువల్స్ ని మనం క్రింద చూడవచ్చు. షఫాలీ కి 2004 వ సంవతసరం లో హర్మీత్ సింగ్ తో వివాహం అయ్యింది. హర్మీత్ సింగ్ ఒక మ్యూజిషియన్. వీళ్లిద్దరు కలిసి మీట్ బ్రదర్స్ అనే మ్యూజిక్ ఆల్బం కి పని చేశారు. అప్పట్లో ఏర్పడిన వీళ్ళ మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది.

అయితే వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా 2009 వ సంవత్సరం లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగానే బ్రతికిన షఫాలీ 2015 వ సంవత్సరం లో ప్రముఖ నటుడు పరాగ్ త్యాగి ని ప్రేమించి పెళ్లాడింది. ఇక షఫాలీ కెరీర్ విషయానికి వస్తే 2002 వ సంవత్సరం లో ‘కాతా లగా’ అనే రీమిక్స్ పాత ద్వారా పాపులారిటీ ని సంపాదించింది. ఈ సాంగ్ లెజండరీ యాక్టర్ ధర్మేంద్ర పాత సినిమాలోని క్లాసిక్ సాంగ్ అనే సంగతి తెలిసిందే. అయితే ఒరిజినల్ వెర్షన్ కంటే రీమిక్స్ వర్షన్ వేరే లెవెల్ లో హిట్ అయ్యింది.

యూత్ ఆడియన్స్ షఫాలీ అందచందాలకు మంత్రముగ్దులు అయిపోయారు. ఆ తర్వాత రెండు మూడు ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపించింది. చూసేందుకు హాట్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. కానీ సినిమాల్లో అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. తన కెరీర్ మొత్తం మీద ఈమె కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ఇక ఆ తర్వాత టీవీ షోస్ కొన్నిట్లో పాల్గొన్నది.

ఇండియా లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటైన హిందీ బిగ్ బాస్ సీజన్ 13 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నది. ప్రైవేట్ ఆల్బుమ్ ద్వారా కంటే ఎక్కువగా ఈమె బిగ్ బాస్ షో ద్వారానే ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కెరీర్ ఆశించిన స్థాయిలో అయితే ఈమెకు సాగలేదు. అయితే ఏమీ భర్త పరాగ్ త్యాగి మాత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లోనూ, సీరియల్స్ లోనూ నటించాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *