బంగారం ధరలు ఢమాల్, రూ.3,660 తగ్గిన బంగారం ధర..! కొత్త ధరలు ఎలా ఉన్నాయో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

బంగారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బంగారం స్వచ్ఛతను ధృవీకరించే హాల్‌మార్క్ సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. రేట్లు వివిధ జ్యువెలరీ షాపుల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. 22 క్యారెట్ల ఆభరణాల కొనుగోలు సమయంలో మేకింగ్ ఛార్జీలను పరిశీలించాలి. ఎందుకంటే ఇవి ఒక షాపు నుంచి మరో షాపుకు మారుతాయి. అయితే భారతదేశంలో బంగారం ధరలు జూన్ 15 నుంచి తగ్గుతున్నాయి.

రోజురోజుకూ పతనం అవుతున్నాయి. మనం 2 వారాలుగా ధర ఎంత తగ్గిందో గమనిద్దాం. జూన్ 15న, 24 క్యారెట్ల పెట్టుబడి బంగారం ధర 10 గ్రాములకు రూ.1,01,680గా ఉండగా, 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.93,200గా నమోదైంది. అయితే, ఇవాళ (జూన్ 29).. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.98,020గా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.89,850గా ఉంది. ఇది చాలా ఎక్కువ తగ్గుదలే. ఈ 2 వారాల్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.3,660 (3.6%) తగ్గింది.

22 క్యారెట్ల బంగారం ధర రూ.3,350 (3.6%) తగ్గింది. ఈ ధరల క్షీణతకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు దోహదపడ్డాయి. బంగారం ధరల తగ్గుదలకు కారణాలు:-బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలలో ఒకటి అమెరికా డాలర్ బలపడటం. బంగారం, అమెరికా డాలర్ మధ్య రివర్స్ సంబంధం ఉంటుంది. డాలర్ బలపడినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. అదే.. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు పెరుగుతాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసింది. అధిక వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి.

అందువల్ల డాలర్‌పై నమ్మకం పెరిగింది. డాలర్ బలపడింది. అంతేకాక ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తగ్గింది. ప్రపంచ పరిస్థితుల్లో ఉద్రిక్తతలు కొంత తగ్గాయి. అందువల్ల పెట్టుబడిదారులు.. బంగారాన్ని అమ్మేసుకొని.. ఆ డబ్బుతో డాలర్స్, బాండ్లు కొంటున్నారు. భారతదేశంలో ఆషాఢమాసం (జూన్-జులై) సంప్రదాయకంగా చెడు కాలంగా చెబుతారు. ఈ కాలంలో వివాహాలు, శుభకార్యాలూ జరగవు. వేడుకలు జరుపుకోరు. కొత్త కార్యక్రమాలు పెట్టుకోరు.

అందువల్ల బంగారం కొనుగోళ్లు తగ్గుతాయి. డిమాండ్ బాగా తగ్గిపోయింది. అందువల్ల ధర కూడా తగ్గుతోంది. అలాగే.. షేర్ మార్కెట్లలో జోరు ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుంటే… ఇన్వెస్టర్లు.. బంగారంపై కంటే.. ఇతర మార్గాల ద్వారా ఎక్కువ రాబడి వస్తోందని భావించి.. గోల్డ్‌పై పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. అందువల్ల ధరలు తగ్గుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *