కూతురి చేసిన పనికి బతికుండగానే పిండం పెట్టిన తల్లిదండ్రులు. ఆ కూతురు ఏం చేసిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

యువతి చేసుకున్న పెళ్లి విషయంపై యువతి మేనమామ సోమనాథ్ బిశ్వాస్ మాట్లాడుతూ.. తన మేనకోడలి పెళ్లి వైభవంగా చేయాలనీ భావించమని.. అందుకనే మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయం చేశామని..అయితే మా మాట వినడానికి కూడా ఇష్టపడలేదు.. మమ్మల్ని విడిచి పెట్టి.. చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వేరే వ్యక్తితో పారిపోయింది. వేరే చోట వివాహం చేసుకుందని చెప్పారు.

ఆ యువతి పెళ్లి జరిగిన 12 రోజుల తర్వాత తాము తన మేనకోడలు మరణించినట్లు భావించి ఈ పిండ ప్రదానం ఆచారం నిర్వహించామని హిందూ సంప్రదాయం ప్రకారం తలలు గుండు కొట్టించు కోవడంతో సహా అన్ని ‘శ్రద్ధ’ ఆచారాలను అనుసరించామని తెలిపారు. పూజారి వేడుక నిర్వహించిన చోట ఆ యువతి ఫోటోకి పూలమాల వేశారు. ఇదే విషయంపై యువతి తల్లి మాట్లాడుతూ..

తమ మాటకు విలువ ఇవ్వకుండా ఇంటి నుంచి పారిపోయిన తమ కూతురు తనకు బతికి ఉన్నా చచ్చినట్లేనని.. అందుకనే తన కూతురుకి సంబంధించిన వ్యక్తిగత వస్తువులన్నింటినీ తగలబెట్టాము” అని చెప్పారు. ఏమి జరిగిందంటే.. నాడియా జిల్లాలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి కుటుంబ సభ్యులు వివాహం ఏర్పాటు చేశారు. అయితే ఆ యువతి పెళ్లిని తిరస్కరించింది.. పెళ్లి వద్దంటూ తిరుగుబాటు చేసింది.

కుటుంబంలో అనేకసార్లు గొడవలు జరిగిన తర్వాత, ఆమె వేరే మతానికి చెందిన యువకుడితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. వేరే చోట పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 12 రోజుల తర్వాత ఫ్యామిలీ బతికి ఉండగానే మరణించిన వ్యక్తికీ నిర్వహించినట్లు ఇప్పుడు కర్మలు నిర్వహించారు. అయితే అమ్మాయి తండ్రి విదేశాల్లో పనిచేస్తున్నాడ. అయితే తన భార్య, కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చాడని బిశ్వాస్ తెలిపారు.

ఆ యువతి జిల్లాలో వేరే చోట తన అత్తమామల వద్ద ఉందని, మనస్తత్వవేత్తలు ఆమెకు కౌన్సెలింగ్ ఇస్తున్నారని ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. “ఈ సంఘటన గురించి మాకు తెలిసింది. అయితే ఆ యువతి మేజర్ కనుక మేము సొంతంగా ఎటువంటి చర్య తీసుకోలేము. ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు కూడా అందలేదని చెప్పారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *