పదిహేనేళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రంభ.. అప్పట్లో భారీ ఫాలోయింగ్ సంపాదించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం లాంటి సౌత్ ఇండియన్ భాషల్లో వెండితెరకు గ్లామర్ అద్దిన తారల్లో ఒకరిగా నిలిచింది. బబ్లీ, గ్లామరస్ హీరోయిన్గా ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది రంభ. అయితే తెలుగులో రంభ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది.
అల్లరి ప్రేమికుడు, అల్లుడా మజాకా, బావగారూ బాగున్నారా, బొంబాయి ప్రియుడు ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు రంభ. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ నటించి మెప్పించారు రంభ. ఈ అమ్మడి అందానికి ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇప్పటికి కూడా తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు రంభ. పిల్లి తర్వాత రంభ సినిమాలకు దూరం అయ్యింది.

ఈ అందాల భామ మలేషియాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకునింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు. ఇదిలా ఉంటే రంభ కూతురి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రంభ కూతురు చాలా అందంగా ఉంది. అచ్చం తల్లిలానే ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే రంభ కూతురికి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో రంభ కూతురు చాలా చక్కగా మాట్లాడుతూ కనిపించింది. అయితే అందంతోనే కాదు వాయిస్ లోనూ ఈ చిన్నది తల్లిపోలికే. ఆమె మాట్లాడుతుంటే అచ్చం రంభ మాట్లాడినట్టే ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.