హీరోయిన్‌ ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా, ఈ టాలీవుడ్ హీరోయిన్‌కు ఎంత ధైర్యమో చూశారా..? ఒళ్లు గగుర్పొడిచే వీడియో.

divyaamedia@gmail.com
2 Min Read

వెళ్లవయ్యా.. వెళ్లు అంటూ జయం సినిమాతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది హీరోయిన్ సదా. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి యువతకు దగ్గరైంది. ఈ మధ్య సినిమాలు చేయడం మానేసి కొన్ని రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా మారింది. అయితే సాధారణంగా మనం చిన్న పాము కనిపిస్తేనే భయపడిపోతాం. అలాంటిది ఈ హీరోయిన్ మాత్రం ఎంతో ధైర్యంగా 16 అడుగుల తాచు పామును పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించింది. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొని పామును క్షేమంగా తీసుకెళ్లిపోయి దట్టమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ ఈ టాలీవుడ్ హీరోయిన్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇదే సందర్భంగా పాములను చంపడం మంచిది కాదని ఆమె ఇచ్చిన సందేశం కూడా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ 16 అడుగుల తాచుపామును ధైర్యంగా పట్టుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘ వెళ్లవయ్యా వెళ్లు’ అంటూ తెలుగు ఆడియెన్స్ ను అలరించిన సదా.

ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలకు దూరంగా ఉంటోంది హీరోయిన్ సదా. వైల్డ్ ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టమున్న ఆమె నిత్యం అడవుల్లో తిరుగుతూ ఎన్నో రకాల పక్షులు, జంతువులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటోంది. అలా తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో ఓ కింగ్ కోబ్రాను పట్టుకుని అడవిలో వదిలిపెట్టే వీడియోను షేర్ చేసింది. ఇదే సందర్భంగా ఓ సామాజిక సందేశాన్ని కూడా పంచుకుంది. ‘ఎవరికైనా పాములు కనిపిస్తే.. దయ చేసి వాటిని చంపకండి.

పాములు లేకపోతే ఎకో సిస్టమ్ పూర్తిగా దెబ్బ తింటుంది. మీకు ఎక్కడైనా పాములు కనిపిస్తే భయపడకుండా వెంటనే రెస్క్యూ టీమ్ కు కాల్ చేయండి. మన చుట్టూ ఎన్నో రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి. మనం గూగుల్ సెర్చ్ చేసినా వారి ఫోన్ నెంబర్స్ తదితర వివరాలు మనకు కనిపిస్తాయి. వెంటనే వారికి ఫోన్ చేసి పాములను పట్టించండి. వాటిని చంపకుండా దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేయండి’ అంటూ సూచనలిచ్చింది సదా. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *