సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే సంగతి అందరికి తెలిసిన విషయమే.. ఐపీఎల్‌తో కావ్యా మారన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అభిమానులు ఆమెను ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్‌తో ప్రేమ, వివాహం గురించి వస్తున్న పుకార్లను అనిరుధ్ రవిచందర్ ఖండించాడు.
తన అభిమానులు ప్రశాంతంగా ఉండమని విజ్ఞప్తి చేస్తూ, అనిరుధ్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ‘వివాహం? హహ… ప్రశాంతంగా ఉండండి, దయచేసి పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి’ అని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌తో, కావ్య మారన్‌తో తన సంబంధం గురించి వస్తున్న అన్ని ఊహాగానాలను అనిరుధ్ పుల్‌స్టాప్ పెట్టేశాడు. అయితే, డేటింగ్ పుకార్లకు ఆయన ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

దీంతో ఇద్దరూ ఇంకా వివాహం చేసుకోనప్పటికీ, వారు కచ్చితంగా డేటింగ్ చేస్తున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అనిరుధ్, కావ్య గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారని పేర్కొంటూ ఒక పోస్ట్ వైరల్ అయింది. ఒక ప్రైవేట్ విందులో ఇద్దరూ కలిసి గడపడం చూశామని కూడా కొంతమంది పేర్కొన్నారు.
అనిరుధ్ బంధువు, సూపర్ స్టార్ రజనీకాంత్, కావ్య తండ్రి, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ తో ఈ సంబంధం గురించి మాట్లాడారని అనే విషయం కూడా వైరల్ అయింది.
Marriage ah? lol .. Chill out guys 😃 pls stop spreading rumours 🙏🏻
— Anirudh Ravichander (@anirudhofficial) June 14, 2025