సనా మక్బూల్ తెలుగులో దిక్కులు చూడకు రామయ్య చిత్రంలో నటించింది. 2014లో వచ్చిన ఈ సినిమాలో సంహిత పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 2017లో మా ఓ చందమామ చిత్రంలో బుజ్జమ్మగా పాత్రలో మెరిసింది. అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె పరిస్థితి ఇప్పుడు మరింత క్షీణించింది. దీంతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది.
ఈ విషయాన్ని డాక్టర్ ఆశ్నా కంచ్‌వాలా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సనా మక్బుల్ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను నెట్టింట షేర్ చేసిన ఆమె ‘మై డియర్ స్ట్రాంగ్ లేడీ.. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. నిన్ను చూసి నేను చాలా గర్విస్తున్నాను. నీ ధైర్యం కోల్పోకుండా అలాగే పోరాడు.
ఈ కఠినమైన పరిస్థితుల నుంచి నువ్వు త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నీవెంటే ఉన్నాను’అని సదరు నటికి ధైర్యం నూరిపోశారు. ప్రస్తుతం సనా మక్బుల్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సనా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
కాగా సనా మక్బుల్ ఇటీవల తన కాలేయ వ్యాధి గురించి బయటపెట్టింది. ఆమె 2020 నుంచి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ వ్యాధి వల్ల తన శరీరంలోని కణాలు కాలేయంపై దాడి చేస్తాయని పేర్కొంది. ఇప్పుడు దీని కారణంగానే సనా ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది.
Sana Makbul Hospitalised
— Filmore (@filmoreindia) June 9, 2025
Bigg Boss OTT 3 winner and actress Sana Makbul has been admitted to the hospital due to a “grave condition,” as confirmed by her close friend Aashna Kanchwala.
Though details remain private, Sana has previously opened up about battling autoimmune… pic.twitter.com/mIvN4aNfYK