‘హరి హర వీరమల్లు’ పై పెద్ద కుట్ర..! రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్..?

divyaamedia@gmail.com
2 Min Read

పవన్ కళ్యాణ్.. చిత్రం రిలీజ్ అవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ రకమైన పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’కి బయ్యర్లు దొరకట్లేదంటే అసలు నమ్మశక్యంగా లేని మాటలను కొంత మంది పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు హరి హర వీరమల్లు సినిమాపై కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ సినిమా జూన్ 12న విడుదల చేస్తున్నాము అనగానే.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల తర్వాత తమ హీరోని స్క్రీన్ పైన చూస్తాము అని.. సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ తేది మాత్రం.. మారదు అని నిర్మాత కూడా నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా వాయిదా పడుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, కొన్ని వీఎఫ్ఎక్స్ వర్కులు పూర్తి కాకపోవడం వల్ల.. ఈ సినిమాను వాయిదా వేయాలని నిర్మాత నిర్ణయించుకొన్నట్టు సమాచారం. ఎందుకు తగ్గట్టుగానే అమెరికాలో ఈ సినిమా టికెట్లను ఆన్లైన్ నుంచి కూడా తీసేయడంతో..

ఈ చిత్రం తప్పకుండా వాయిదా పడుతుంది అనే క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో.. నిర్మాతకు ఈ సినిమా వల్ల.. విడుదలకు ముందే కొద్దిగా నష్టం వస్తూ ఉండటంతో.. పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ నుంచి 11 కోట్లు వెనక్కి ఇచ్చేశారు అని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాని జూలై మొదటి వారంలో విడుదల చేయాలి అనుకుంటున్నారంట సినిమా యూనిట్. ఈ సినిమా సెన్సార్ కూడా ఇప్పటివరకు పూర్తి కాలేదు. మరోపక్క ఈ చిత్రం..థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో.. నిర్మాత టెన్షన్లో ఉన్నారంట.

ఇక నిర్మాత ఇబ్బందులు చూసి తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసారంట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ తెలిసిందే. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా ఫ్రీ రిలీజ్ విషయంలో ఇలాంటి.. ఇబ్బందులు రావడం చూసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాకు ఉండే.. అంచనాలు కూడా ఈ సినిమాకి పెద్దగా కనిపించడం లేదు. మరి విడుదలయ్యాకన్నా ఈ చిత్రం ఈ అవంతరాలు అన్ని దాటి.. మంచి విజయం సాధిస్తుందేమో చూడాలి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *