కొంతమంది తమకు ఇష్టమైన వాళ్ల ఫోటోలు, భార్యల ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు పర్సులో పెట్టుకుంటారు. మరికొందరు దేవుళ్ల ఫోటోలు పర్సులో పెట్టుకుంటారు. అయితే.. కొన్ని వస్తువులను పర్సులో పెట్టుకుంటే.. ఎప్పుడూ అదృష్టం మీ వెంటే ఉంటుందట. మీరు ఎప్పుడూ అదృష్టవంతులుగా ఉండాలంటే.. ఈ వస్తువులను కంపల్సరీ పర్సులో పెట్టుకోవాలట. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్ర సూత్రాల ప్రకారం భర్త తన పర్సులో తన ప్రియమైన అర్ధాంగి ఫోటోని పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
అవును శాస్త్రాల ప్రకారం, భర్త తన భార్య ఫోటోను తన పర్సులో పెట్టుకోవడం వలన వీరి సంబంధంలో ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు ఆర్థిక స్థిరత్వాన్ని ,అదృష్టాన్ని కూడా తెస్తుందని నమ్ముతారు. హిందూ సంప్రదాయంలో వివాహిత స్త్రీని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. అలాగే.. శాస్త్రాల ప్రకారం భార్యను శుక్రుడు అని చెబుతారు. శుక్రుడు సంపదకు అధిపతి కనుక భార్య ఫోటోను భర్త తన పర్సులో ఉంచుకోవడం వల్ల అతని జాతకంలో శుక్ర గ్రహ స్థానం బలపడుతుంది.

అతని సంపద పెరుగుతుంది. అతను విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తాడని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జీవితంలో భార్య రాకతో అనేక మార్పులు వస్తాయి. జీవితంలో సంపద పెరగమే కాదు.. శుక్రుడి శక్తి వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. అంతేకాదు సొంత ఇంటి కల నిజమవుతుంది. ఎవరైనా తమ జాతకంలో శుక్ర ప్రభావాన్ని మెరుగుపరచుకోవాలనుకున్నా .. మీరు కోరుకున్నది పొందాలనుకున్నా తప్పని సరిగా మీ భార్య ఫోటో ఉంచుకోవాలి.
అంతేకాదు మీ భార్య ఫోటోను మీ పర్సులో ఉంచుకోవడం వల్ల మీ ప్రేమ బలపడుతుంది. అవును.. మీరు మీ పర్సు తెరిచి మీ భార్య ఫోటోను చూసిన ప్రతిసారీ.. మీరు ఆమెను గుర్తుంచుకుంటారు. మీ భార్య మీ పట్ల చూపించే ప్రేమని, కేరింగ్ ని తలచుకుంటారు. ఇలాంటి అనుభూతులు భార్యాభర్తల మధ్య ప్రేమను బలపరుస్తుంది. మీ భార్య ఫోటోను మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే.. ఎప్పుడైనా అధిక పని కారణంగా ఒత్తిడికి గురైనప్పుడు, మనసు కలత చెందినప్పుడు లేదా మనసు విచారంగా ఉన్నప్పుడు, మీ పర్సులో ఉన్న మీ భార్య ఫోటోను చూడటం వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది.

భార్య చిత్రాన్ని మీ పర్సులో పెట్టుకోవడం వలన మీలో సానుకూల భావాలు బలపడతాయి. మీ బంధం బలపడుతుంది. అంతేకాదు ఇది మిమ్మల్ని మరింత దృఢంగా.. మీ కుటుంబం, ఇంటికి అనుసంధానం భార్య అని నమ్ముతారు. అంతేకాదు భార్య ఫోటోను భర్త తన పర్సులో ఉంచుకోవడం వల్ల అదృష్టం , ఆర్థిక స్థిరత్వం లభిస్తాయని కొందరు నమ్ముతారు.