కోట్ల ఆస్తిని, సినిమాలు వదిలేసి కూలీ పని చేసుకుంటున్న స్టార్ హీరో, ఇలా ఎందుకో చేస్తున్నాడో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

వరుస హిట్స్ అందుకుంటూ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే విదేశాలకు వెళ్లి గొర్రెలు కాస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. తనే ప్రణవ్ మోహన్ లాల్. మలయాళీ చిత్రపరిశ్రమలో యంగ్ హీరోలలో ఆయన ఒకరు. సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు. కోట్ల ఆస్తిని, సినిమాలు వదిలేసి కూలీ పనికి వెళ్తున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా తనదైన ముద్ర వేశాడు ప్రణవ్ మోహన్ లాల్. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించాడు.

కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. సామాన్యుడిగా జీవితం గడుపుతూ సోషల్ మీడియాలో సైతం అంతగా యాక్టివ్ గా లేరు. అసలు విషయానికి వస్తే.. ప్రణవ్ మోహన్ లాల్… బాలనటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్క్రీన్ ప్లే రైటర్ గా.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి చివరకు హీరోగా సక్సెస్ అయ్యారు. హృదయం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు మలయాళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళంలో వర్షంగళ్కు శేషం సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రణవ్.. ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఆసక్తి ఉన్న ప్రణవ్.. ఇప్పుడు వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. హీరోగా నటించడం ప్రారంభించిన 7 ఏళ్లల్లో దాదాపు 5 చిత్రాల్లో నటించాడు. ప్రతి సినిమా కంప్లీట్ కాగానే అనుభవం కోసం ఏదోక ఊరికి వెళ్తుంటాడు. ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్న ప్రణవ్.. అక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా పనిచేస్తున్నాడ. భోజనం, షెల్టర్ ఇస్తారని జీతం మాత్రం ఉండదని గతంలో ఆయన తల్లి, మోహన్ లాల్ సతీమణి తెలిపారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *