కాజోల్.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన అత్యధిక చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మరో స్టార్ హీరో అజయ్ దేవగన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు. అయితే బాలీవుడ్ హీరోయిన్లు కాజోల్, రాణీ ముఖర్జీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.
వీరి చిన్నాన్న, ప్రముఖ దర్శకుడు రోనో ముఖర్జీ(83) కన్నుమూశారు. ఆయన నటి శర్బానీ ముఖర్జీకి తండ్రి. మరోవైపు కాజోల్, రాణీ ముఖర్జీ, అయాన్ ముఖర్జీ, తునిషా ముఖర్జీలకు చిన్నాన్న. శర్బానీతో పాటు ప్రముఖులు రోనో ముఖర్జీకి నివాళులర్పించారు. అయితే, తన సినిమా ‘ది మామ్’ ప్రమోషన్లో బిజీగా ఉండటంతో కాజోల్ అంత్యక్రియలకు రాలేకపోయారు. రోనో మరణవార్తతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

రోనో ముఖర్జీ మరణానికి గల కారణం ఇంకా తెలియలేదు, కానీ వయసు సంబంధిత సమస్యలే కారణమని తెలుస్తుంది. నటుడు, దర్శకుడు, అయాన్ ముఖర్జీ బావ అయిన ఆశుతోష్ గోవారికర్ కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘హవాన్’ (1977), ‘తూ హీ మేరీ జిందగీ’ (1965) సినిమాలతో రోనో ముఖర్జీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. మార్చి 14న అయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ చనిపోయారు. ఆ దుఃఖం నుంచి ఇంకా తేరుకోకముందే రోనో మరణం వారి కుటుంబాన్ని మరింత శోకసంద్రంలో ముంచెత్తింది.