కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సచిన్‌ గారాల పట్టీ సారా టెండూల్కర్‌, సీక్రెట్‌గా జరిగిపోయిందా..?

divyaamedia@gmail.com
2 Min Read

సారా టెండూల్కర్ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించాడని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. సారాతో లింక్ చేయబడుతున్న వ్యక్తి మరెవరో కాదు ‘గల్లీ బాయ్’ ఫేమ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది. ప్రస్తుతం సారా, సిద్ధాంత్ డేటింగ్ లో ఉన్నారంటూ హిందీ చిత్ర పరిశ్రమలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు అప్‌డేట్లను సారా టెండూల్కర్‌ తన సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా నిశ్చితార్థం ఫొటోను కూడా సారా టెండూల్కర్‌ పంచుకుంది. ఈ ఫొటో చూసి అందరూ షాక్‌కు గురయ్యారు.

ఆమె నిశ్చితార్థం చేసుకుందా? అని చర్చనీయాంశంగా కాగా వాస్తవం మాత్రం వేరే ఉంది. సారా టెండూల్కర్ నిశ్చితార్థం ఫొటోను పంచుకుంటూ శుభవార్త వినిపించింది. సచిన్ కుమార్తె తన స్నేహితురాలికి సంబంధించిన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పంచుకుంది. అది వైరల్‌గా మారింది. సారా టెండూల్కర్‌ స్నేహితురాలు మల్లికా సరుప్రియ. ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉన్న మల్లికతో సారా స్నేహం కొన్నేళ్ల నుంచి ఉంది. వారిద్దరూ మంచి స్నేహితులు.. ఎప్పుడూ కలుస్తూ టూర్లు, పార్టీలు చేసుకుంటుంటారు.

ఆమెను అర్జున్ టెండూల్కర్ కూడా ఫాలో అవుతుంటాడు కూడా. తన ప్రియమైన స్నేహితురాలు మల్లికా నిశ్చితార్థం చేసుకుంది. ఆ వేడుకకు సారా టెండూల్కర్‌ కూడా హాజరైంది. మల్లికా, ఆమెకు కాబోయే భర్త ఫొటోలను సారా టెండూల్కర్‌ తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. సారా స్నేహితురాలు మల్లికా సరుప్రియ సోహమ్ అగర్వాల్‌తో నిశ్చితార్థం చేసుకుంది. వారిద్దరి నిశ్చితార్థం సందర్భంగా సారా టెండూల్కర్‌ శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేసింది.

ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు సారా టెండూల్కర్‌ పెళ్లి ఎప్పుడూ? అని ప్రశ్నిస్తున్నారు. సారా టెండూల్కర్ యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో ప్రేమలో ఉందనే పుకార్లు వస్తున్నాయి. అది కాదని తేలడంతో సిద్ధాంత్‌ చతుర్వేదితో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఇలా సారా టెండూల్కర్‌ ప్రేమ, డేటింగ్‌పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అందులో ఏది వాస్తవమో సారా ధ్రువీకరించలేదు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *