Skin Care: చర్మంపై ఇలాంటి మచ్చలు వెంటనే తగ్గిపోవాలంటే.. ఏం చెయ్యాలో తెలుసుకోండి.

divyaamedia@gmail.com
2 Min Read

Skin Care: చర్మంపై ఇలాంటి మచ్చలు వెంటనే తగ్గిపోవాలంటే.. ఏం చెయ్యాలో తెలుసుకోండి.

Skin Care: చర్మంపై ఇలాంటి మచ్చలు వెంటనే తగ్గిపోవాలంటే.. ఏం చెయ్యాలో తెలుసుకోండి.డార్క్ లేదా బ్లాక్ స్పాట్‌లు సాధారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్య కాదు, అయితే కొందరు వ్యక్తులు వాటిని సౌందర్య కారణాల వల్ల తొలగించాలనుకోవచ్చు. కాలక్రమేణా నల్ల మచ్చలను తేలికగా లేదా మసకబారడానికి సహాయపడే అనేక సహజ గృహ నివారణలు ఉన్నాయి. అయితే బిగుతుగా, మృదువుగా ఉండే అందమైన చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న పొరబాట్ల వల్ల చర్మం అకాల వృద్ధాప్యానికి గురవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మంపై గాయాలు నయమైనా వాటి తాలూకు దద్దుర్లు, మచ్చలు అంత తేలిగ్గా వదిలిపోవు.

Also Read : మీరు ఏ సమయాలల్లో పాలు తాగితే మంచిదో తెలుసుకోండి.

గాయాలు మానిన తర్వాత వాటి వల్ల ఏర్పడే మచ్చలు తొలగించి, తక్కువ సమయంలో చర్మాన్ని మెరిపించడానికి ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వాలి. గాయాలు తగిలినప్పుడు వాటిపై బ్యాక్టీరియా సంక్రమణ అధికంగా ఉంటుంది. అందుకే గాయాన్ని చల్లటి నీటితో క్రమం తప్పకుండా కడుగుతూ ఉండాలి. ఇది చర్మంలోని నిర్దిష్ట భాగానికి రక్త ప్రసరణ అందేలా చేస్తుంది. ఫలితంగా సూక్ష్మజీవుల సమూహం పూర్తిగా నాశనం అవుతుంది. చర్మానికి అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు దద్దుర్లు వస్తుంటాయి.

Skin Care

ఫలితంగా చర్మం పొడిగా మారుతుంది. దీంతో గాయాలు మానినా మచ్చలు త్వరగా మాసిపోవు. ఇలాంటప్పుడు కొబ్బరి నూనె బలేగా ఉపయోగపడుతుంది. ఈ నూనె చర్మానికి తేమ తెస్తుంది. మచ్చలు కూడా క్రమంగా మాయమవుతాయి. బ్యాక్టీరియా, శిలీంధ్రాల వంటి సూక్ష్మక్రిములను చంపడంలో టీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టీ వడకట్టిన తర్వాత, డికాషన్‌ వేస్ట్‌ను నీటితో కడిగి, ఆపై ఆ పేస్ట్‌ను గాయంపై వేయాలి. ఇలా చేస్తే వేగంగా ఫలితాలు పొందవచ్చు. కేవలం 7 రోజుల్లోనే మచ్చలు మాయం అవుతాయి. చర్మ సంరక్షణలో కలబందకు మించిన ప్రత్యామ్నయం లేదు.

Also Read : నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది, కావాలంటే మీరు ట్రే చెయ్యొచ్చు.

వివిధ విటమిన్లు సమృద్ధిగా ఉండే కలబంద రసం మచ్చలను నయం చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. దీనిని నేరుగా చర్మానికి పూయడం ద్వారా గాయాలు, మచ్చలు వేగంగా మానిపోతాయి. మొండి చర్మపు మచ్చలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా సరైనది. బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లతో కలిపి మచ్చల మీద అప్లై చేసి, ఆ తర్వాత కాసేపాగి కడిగేయాలి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ కలిపి స్నానం చేసినా ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్, యాసిడ్ కంటెంట్ నిర్జీవమైన చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *