వామ్మో, మహిళ చెవిలోకి దూరిన పాము, బయటకు రాకుండా ఈ పాము ఏం చేసిందో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

రాత్రుళ్లు ప‌డుకున్న స‌మ‌యంలో చెవుల్లోకి వెళ్లిన కీట‌కాలు ఇబ్బంది పెడుతుంటాయి. తీవ్ర‌మైన నొప్పిని క‌లిగిస్తుంటాయి. అయితే ఈ కాలంలో ఇళ్లలో బట్టలలో, కరెంటు బోర్డుల మీద, బూట్లలో, వాహానాల్లో పాములు వెళ్లిదాక్కుంటాయి. అంతేకాకుండా ఇంట్లో చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే వేసవి కాలంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండటం చాలా అవసరం.

పైగా పాము పేరు వింటేనే చాలా మంది అల్లంత దూరం ఎగిరిపడతారు. చాలా మందికి పాములను దూరం నుంచి చూసినా.. అది తమ ఒడిలోనే ఉన్నట్లు చమటలుపట్టి ఉక్కిరిబిక్కిరై గజగజ వణికిపోతుంటారు. ఈ భయంతో కొందరు చీకట్లో తాడును చూసినా పాముగానే భావిస్తుంటారు. ముఖ్యంగా చెట్లు, అడవులు, పొలాలకు దగ్గరగా ఇళ్లు ఉండేవాళ్లు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వేసవిలో నెల మీద పడుకోకపోవడమే బెటర్‌.

రాత్రి పూట విషపురుగులు చెవిలో ప్రవేశించే ప్రమాదం లేకపోలేదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి ఓ భయానక అనుభవమే ఎదురైంది. నేలపై నిద్రిస్తున్న సమయంలో ఏకంగా ఓ పాము మహిళ చెవిలోకి దూరింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో.. మహిళ చెవిలో దూరిన మహిళను చూడవచ్చు. అది ఎలా వెళ్లిందో కానీ తెలియదుగానీ పాము పూర్తిగా ఆమె చెవిలోకి దూరిపోయింది. పాము చివర తోక మాత్రమే చెవి బయట కనిపించింది.

దీంతో సదరు మహిళ బాధతో విలవిల్లాడిపోయింది. వెంటనే హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా వైద్యులు ఎంత ట్రై చేసిన పాము పిల్ల మాత్రం బైటకు రాలేదు. చివరకు డాక్టర్ ఒక ప్లక్కర్ తీసుకుని పాము తోకను పట్టి బైటకు తీసే ప్రయత్నం చేశాడు. వీడియోలో దాని తోకను పట్టుకుని బైటకు లాగడం చూడొచ్చు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *