వామ్మో.. అనసూయ కొత్త ఇల్లు ఎలా ఉందొ చుడండి, ఆ ఇంటి ధర ఎంతో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

అనసూయ.. చేతినిండా సినిమాలతో, టీవీ షోలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో అనసూయ లేటెస్టుగా హైదరాబాద్ లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. సోమవారం తన ఫ్యామిలీతో కలిసి కొత్తింటిలోకి అడుగుపెట్టింది. తన ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టింది. అయితే టాలీవుడ్ నటి, ఫేమస్ యాంకర్ అనసూయ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తన సేవింగ్స్‌తో ఆమె ఓ ఇటీవలే కొత్త ఇల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తన గృహ ప్రవేశం తాలూకు ఫొటోస్ స్వయంగా అనసూయ షేర్ చేయడంతో అందరి దృష్టి ఆ ఇల్లుపైనే పడింది. అనసూయ కొత్త ఇంటికి చేరడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆనడం వ్యక్తం చేస్తూ స్పెషల్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇంకొందరైతే అసలు హైదరాబాద్ లో ఈ ఇల్లు ఎక్కడుంది? దీని ధర ఎంతై ఉంటుంది అనే దానిపై ఆరా దీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇంటికి కొన్ని సంగతులు వైరల్ అవుతున్నాయి. అనసూయ తీసుకున్న ఈ ఇల్లు అల్ట్రా లగ్జరీగా ఉందని, ఈ రోజుల్లో ఉండాల్సిన సకల సౌకర్యాలతో పాటు ఇందులో 4 బెడ్ రూమ్స్, పెద్ద హాల్, డ్రాయింగ్ రూమ్, మినీ థియేటర్ రూమ్ ఉన్నాయని సమాచారం.

కళ్ళు చెదిరే ఇంటీరియర్ తో ఈ ఇల్లు డిజైన్ చేశారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఇల్లు ధర రూ.50 కోట్లు అని తెలుస్తోంది. లగ్జరీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అన్ని సదుపాయాలతో డిజైన్ చేయించుకుందట అనసూయ. ఏదేమైనా సినిమాల్లో అయినా, రియల్ లైఫ్ లో అయినా అనసూయ రేంజే వేరులే అంటున్నారు ఈ ఇల్లు చూసిన నెటిజన్లు. కాగా, మే 3వ తేదీన తాము కొత్త ఇంట్లోహోమాలు, పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరుపుకున్నాం అని చెప్పింది అనసూయ. తమ ఇంటికి ‘శ్రీరామ సంజీవని’ అనే పేరు పెట్టుకున్నామని ఆమె తెలిపింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ.. వీలుకుదిరిన ప్రతిసారి నెటిజన్లతో టచ్ లోకి వస్తూ ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నిత్యం జనం నోళ్ళలో నానుతుండటం అనసూయ నైజం. ఎప్పుడు ఎలాంటి ఆటం బాంబ్ వేస్తుందా అని ప్రతిరోజు లక్షల మంది కుర్రాళ్ళు ఆమె సోషల్ మీడియా ఖాతాను తొంగి చూస్తుంటారు. అనసూయ కెరీర్‌తో పాటు ఫ్యామిలీ సంగతులపై కూడా నెటిజన్లు ఇంట్రెస్ట్ పెడుతుంటారు. అందుకే తన ఫ్యామిలీ విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటుంది అనసూయ.

ప్రస్తుతం ఇటు సినిమాలు, అటు ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనసూయ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో క్రేజీ రోల్, విమానం సినిమాలో వేశ్యగా నటించి విమర్శకుల ప్రశంసల అందుకుంది అనసూయ. పెదకాపు మూవీలో అనసూయ రోల్ కి మంచి మార్కులు పడ్డాయి. సింబా మూవీలో ఫర్వాలేదనిపించింది. మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *