పెళ్లై ఏడాది కాలేదు, తండ్రైన తెలుగు హీరో కిరణ్‌ అబ్బవరం, సంబరాలు చేసుకుంటున్న యంగ్ హీరో.

divyaamedia@gmail.com
1 Min Read

కిరణ్ అబ్బవరం 1992 జూలై 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా రాయచోటిలో జన్మించారు. 2019లో విడుదలైన “రాజావారు రాణిగారు” సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే సినిమాలో నటించిన రహస్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ల ప్రేమను కొనసాగించిన ఈ జంట, 2024 ఆగస్టు 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అయితే కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గురువారం పండంటి మడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన శుభవార్తను హీరో కిరణ్ అబ్బవరం స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. తనకు కొడ్డుకు పుట్టిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఓ భావోద్వేగభరితమైన పిక్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు.

ఆ పోస్ట్‌లో శిశువు సున్నితమైన పాదాన్ని ఆయన ఎంతో ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించాడు. ఇక సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కిరణ్-రహస్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తనకు కొడుకు పుట్టిన విషయాన్ని ఇన్‌స్టా, ఎక్స్‌ వేదికగా పంచుకోగా.. ఈ పోస్టును చూసిన అతని అభిమానులు క్షణాల్లో దాన్ని వైరల్ చేశారు.

లైక్స్‌, కామెంట్స్‌తో తమదైన రీతితో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఓ అభిమాని కామెంట్‌లో ఇలా రాసుకొచ్చాడు. మీ ఇంటికి జూనియర్ అబ్బవరం వచ్చారంటూ కామెంట్ చేశాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *