హీరోయిన్లని డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు కమిట్మెంట్ అడుగుతారని, సినిమా ఒప్పుకునే ముందే అగ్రిమెంట్ కూడా తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. గతంలో చాలా మంది కథానాయికలు ఇలాంటి ఆరోపణలు చేశారు. మీటూ
ఉద్యమం ఆ మధ్య అన్ని చిత్ర పరిశ్రమలను షేక్ చేసింది. అయితే తాజాగా హీరోయిన్ సయామీ ఖేర్ క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ విషయం తెలిపింది.
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన 19 ఏళ్ల వయసులో తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక మహిళా క్యాస్టింగ్ ఏజెంట్ తనను ఒక తెలుగు సినిమా కోసం కాంప్రమైజ్ అవ్వమని కోరినట్లు వెల్లడించింది. ఈ ఘటన ఆమెను షాక్‌కు గురిచేసిందని, ఇండస్ట్రీపై నిరాశకు గురిచేసిందని తెలిపింది.
ఈ విషయాన్ని ఆమె తన సన్నిహితులతో పంచుకున్నప్పటికీ, ఆ సమయంలో బయటపెట్టలేదు, బయట పెట్టె సాహసం చేయలేదని తెలిపింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, ముఖ్యంగా X( ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో వైరల్ అయ్యాయి, ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై చర్చను రేకెత్తించాయి. అంతే కాదు ఓ టాలీవుడ్ దర్శకుడు కూడా తనను “కమిట్మెంట్” అడిగినట్లు పేర్కొంది, అయితే ఆ దర్శకుడి పేరును వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.