మందులు కూడా కొనలేని దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్..!ఆర్థిక సాయం కోసం..!

divyaamedia@gmail.com
2 Min Read

వైద్యానికి మందలు కొనలేని దుస్థితిలో ఉన్నారు. కిడ్నీలు దెబ్బతినడంతో కొద్దిరోజులుగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు. డైరెక్టర్ వేణు, ప్రియదర్శి సహాయం చేసినా.. ఖర్చులకు చాలడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన చేస్తున్నారు. అయితే బలగం సినిమా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. తెలంగాణ కల్చర్‌ని యదాతథంగా ప్రతిబింబించిన మూవీ. తెలంగాణ రూట్లని వెండితెరపై ఆవిష్కరించిన మూవీ. కమెడియన్‌ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం. ఇందులో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా, కావ్య కళ్యాణ్‌ రామ్‌ ఆయనకు జోడీగా చేసింది.

రూప లక్ష్మి, మురళీధర్‌ గౌడ్‌, సుధాకర్‌రెడ్డి, వేణు, రచ్చ రవి ముఖ్య పాత్రలు పోషించారు. కిడ్నీల సమస్యతో బాధపడుతున్న బలగం నటుడు జీవీ బాబు.. రెండేళ్ల క్రితం వచ్చిన బలగం చిత్రం పెద్ద హిట్‌ అయ్యింది. తెలంగాణ కల్చర్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో ప్రియదర్శికి చిన్నతాత అంజన్నగా నటించాడు జీవీ బాబు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది. ఆయనకు కిడ్నీలు దెబ్బతిన్నాయి. గొంతుకి ఇన్‌ఫెక్షన్‌ రావడంతో నోట మాట రావడం లేదు. చాలా రోజులుగా ఆయనకు డయాలసిస్‌ చేస్తున్నారు.

దీంతో ఆసుపత్రి బిల్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. మందులు కూడా కొనలేని దీనస్థితిలో బలగం నటుడు..జీవీ బాబు ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. బలగం వేణు, ప్రియదర్శి వంటివారు సహాయం చేసినా అవి ఆసుపత్రి ఖర్చులకు కూడా చాలడం లేదు. ఇప్పుడు కనీసం మందులు కూడా కొనలేని దీనస్థితికి చేరుకున్నారు. దీంతో తమకు సహాయం చేయాలని, ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు ప్రాదేయపడుతున్నారు. దాతల కోసం వేచి చూస్తున్నారు.

ప్రియదర్శి చిన్నతాతగా ఆకట్టుకున్న జీవీ బాబు..బలగం చిత్రంలో ప్రియదర్శి చిన్న తాతగా అంజన్న పాత్రలో జీవీ బాబు అదరగొట్టారు. ప్రియదర్శి తాత చనిపోవడంతో ఆ తర్వాత జీవీ బాబు పాత్ర కీలకంగా మారుతుంది. కథని ముందుకు తీసుకోవడంలో ఆయన పాత్ర కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పాత్రలో జీవీ బాబు జీవించారు. ఊర్లో తాతలు ఎలా ఉంటారో అలానే సహజంగా నటించి మెప్పించారు, అందరి దృష్టి ఆకర్షించారు. ఇప్పుడు ఆయన దీనస్థితిలో ఉండటం విచారకరం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *