వరుడు తన వివాహ రాత్రిని ఇద్దరు వధువులతో జరుపుకుంటాడు, ఈ వింత ఆచారం గురించి తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

పెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. ఆంగ్లభాషలోమ్యారేజి అని అంటారు. అయితే గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లా నుంచి ఒక షాకింగ్, ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఇక్కడ వంశదా తాలూకాలోని ఖాన్పూర్ గ్రామంలో ఒక విచిత్రమైన వివాహం జరిగింది. ఇది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాహ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎందుకంటే దానిపై ఇద్దరు వధువుల పేర్లు, ఒక వరుడి పేరు ముద్రించి ఉన్నాయి. మేఘరాజ్‌భాయ్ దేశ్‌ముఖ్ అనే 36 ఏళ్ల వ్యక్తి, మే 19న ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతని ముగ్గురు పిల్లలు కూడా ఈ వివాహంలో పాల్గొన్నారు. ఒక మహిళ నుంచి ఇద్దరు, మరో మహిళ నుంచి ఒకరు పాల్గొన్నారు. నవ్‌సారిలోని ఖాన్‌పూర్ గ్రామానికి చెందిన పార్సీ ఫాలియాలో మేఘరాజ్‌భాయ్ నివసిస్తున్నాడు.

ఆయన మొదట ఖండా గ్రామానికి చెందిన కాజల్ గవిత్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరికీ 2010 సంవత్సరంలో నిశ్చితార్థం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత మేఘరాజ్‌భాయ్, కెలియా గ్రామానికి చెందిన రేఖాబెన్ గెయిన్‌తో ప్రేమలో పడ్డాడు. 2013లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ తరువాత మేఘరాజ్‌భాయ్ ఇద్దరు మహిళలతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో అతనికి కాజల్ ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టగా, రేఖ ద్వారా ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఈ సంబంధంతో రెండువైపులా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.

అందువల్ల ఈ ప్రత్యేకమైన వివాహం పూర్తి ఆచారాలతో జరిగింది. నిజానికి, ఈ వివాహం గిరిజన సమాజంలోని “చండ్ల విధి” లేదా “ఫుల్హార్” అనే ప్రత్యేక సంప్రదాయానికి సంబంధించినది. ఇందులో అబ్బాయి, అమ్మాయి వివాహానికి ముందు భార్యాభర్తల లాగా కలిసి జీవించవచ్చు. వారు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత.. సామాజిక, మతపరమైన ఆచారాల ప్రకారం వివాహం చేసుకుంటారు. మేఘరాజ్‌భాయ్ కూడా అదే సంప్రదాయం ప్రకారం ఇద్దరు అమ్మాయిలతో సంవత్సరాలుగా నివసిస్తున్నాడు. ఇప్పుడు అతను తన సంబంధాలను పెళ్లి ద్వారా అధికారికం చేసుకున్నాడు.

వివాహ కార్డు వైరల్ అయ్యింది, సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది..పెళ్లి కార్డు బయటపడ్డప్పుడు, అందులో ముగ్గురు పేర్లు చూసి అందరూ షాక్ అయ్యారు… ఒక వరుడు, ఇద్దరు వధువుల పేర్లు ఉన్నాయి. ప్రజలు దీన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు. చాలా మంది దీనిని నిజమైన ప్రేమకు ఉదాహరణగా పిలుస్తుండగా, కొందరు గిరిజన సంప్రదాయం గురించి సమాచారాన్ని పొందుతున్నారు. మేఘరాజ్‌భాయ్‌కి వాన్స్‌డా నుంచి మాత్రమే కాకుండా మొత్తం గుజరాత్ నుంచి వివాహ అభినందనలు, కాల్స్ వస్తున్నాయి. ఈ వివాహం ఇప్పుడు “వైరల్ వివాహం”గా మారింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *