Chandrababu: కొడాలి నానికి వార్నింగ్ పంపిన చంద్రబాబు
Chandrababu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రన్న ప్రభుత్వం రైతులకు మరో శుభవార్తను అందించింది. ఖరీఫ్ లో ఈ పంటలో నమోదైన పంటలకు వైసీపీ హయాంలో అమలైన ఉచిత పంటల బీమానే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడుల పైన దృష్టి సారించారు.
ఏపీ సర్కార్ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టిడిపి పార్టీ కార్యాలయాల పైన జరిగిన దాడులు, తెలుగుదేశం పార్టీ నేతలపైన జరిగిన దాడి కేసులను వెలికి తీసే పనిలో పడింది. ఇప్పటికే వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేసి వంశీని పట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్న పోలీసులు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడలో చేసిన దాడుల పైన కూడా చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు సర్కార్ రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
Also Read : తిరుమల వెళ్ళే వారికీ అలెర్ట్, నడకదారిలో మరోసారి చిరుత కలకలం..?
క్యాసినో వ్యవహారంలో గుడివాడలో టీడీపీ నేతలపై దాడులు.. గుడివాడలో క్యాసినో వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడుల పైన ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించినట్టు సమాచారం. కొడాలి నాని క్యాసినో వ్యవహారం పైన జనవరి 21 2022న గుడివాడ వచ్చిన నిజనిర్ధారణ కమిటీ నేతలపైన వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. గుడివాడ టిడిపి కార్యాలయం పైన దాడి చేయడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. క్యాసినో రగడ.. టీడీపీ నేతలపై దాడులు చేసిన వారిపై కేసులు.. అయితే అప్పుడు పోలీసులు ఈ ఘటనల పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా టిడిపి నేతలపైనే కేసులను నమోదు చేశారని అప్పట్లో టిడిపి నేతలు వాపోయారు.
అయితే ఈ ఘటనల పైన ఇప్పుడు దృష్టి సారిస్తున్న ఏపీ పోలీసులు వైసీపీ సీనియర్ నేత దుక్కిపాటి భూషణ్, కొడాలి నాని అనుచరుల పైన కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. వైసిపి నేతలను జైలుకు పంపించే ప్లాన్ లో చంద్రబాబు.. అవసరమైతే ఈ కేసుల్లో వైసిపి నేతలను జైలుకు పంపించేందుకు కూడా చంద్రబాబు సర్కార్ రెడీ అంటుంది. ఇక ఇది మాత్రమే కాదు డిసెంబర్ 25 2022న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న రావి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నేతలపైన వైసీపీ పార్టీ నేతలు దాడులు చేసినటువంటి ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు.
Also Read : రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..ఇక నుంచి అవి కూడా ఉచితంగానే..!
రావితో పాటు టీడీపీ నేతలపై దాడి చేసిన వారిపై కేసులు..కత్తులు, కర్రలు, ఇనప రాడ్లు, పెట్రోల్ ప్యాకెట్లతో వైసిపి కార్యకర్తలు తెలుగుదేశంపార్టీ నేతలపైన దాడి చెయ్యగా అప్పట్లో సిఐ గోవిందరాజులు టిడిపి నేతలు పైనే తప్పుడు కేసులు నమోదు చేసి, వైసిపి నేతలకు వత్తాసు పలికారు. ఇక అప్పటి వీడియోఫుటేజ్ ఆధారంగా మెరుగుమాల కాళీ, నీరుడు ప్రసాద్ తో పాటు మరో 20మందిపై 143,144, 146,188,427, 506 r/w 149 BNS క్రింద కేసులు నమోదు చేశారు .