దిల్ రాజు కూతురికి అమ్మంటే ఎంత ప్రేమో చుడండి, ఏకంగా ఇంట్లో విగ్రహం పెట్టేసింది..!

divyaamedia@gmail.com
2 Min Read

‘దిల్’ రాజు మొదటి భార్య అనిత భౌతికంగా ఈ లోకంలో లేరు. కానీ, కుమార్తె హన్షితా రెడ్డి గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. అమ్మ అనిత అంటే హన్షితకు ఎంత ప్రేమ అంటే… ఏకంగా ఇంట్లో విగ్రహం పెట్టేశారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా సినిమాలు తీస్తున్న ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలోనూ తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక దిల్ రాజు పిల్లలు కూడా ఆయన బాటలోనే పయనిస్తున్నారు.

ముఖ్యంగా కూతురు హన్షితా రెడ్డి ఇప్పటికే నిర్మాతగా బాగా ఫేమస్ అయ్యింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసిన బలగం సినిమాకు హన్షితా రెడ్డినే నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ప్రస్తుతం మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారామె. కాగా దిల్ రాజు మొదటి భార్య, హన్షిత తల్లి అనిత కొన్నేళ్ల క్రితం గుండె పోటుతో కన్నుమూశారు. ఈ క్రమంలోనే తన తల్లి ఎప్పటికీ తనతో ఉండిపోయేలా ఇంట్లోనే విగ్రహం ఏర్పాటు చేసింది. మదర్స్ డే సందర్భంగా ఆదివారం తన ఇంట్లోనే తల్లి అనిత విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు హన్షిత చెప్పుకొచ్చింది.

అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తల్లి విగ్రహాన్ని ప్రేమతో హత్తుకుని కనిపించింది హన్షిత. అలాగే ఆమె కూతురు ఇషితా, అమ్మమ్మతోనూ ఫొటోలు దిగింది. ఈ ఫొటోలకు ‘నాలుగు తరాలు’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుత హన్షితా రెడ్డి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘దిల్ రాజు కూతురికి అమ్మంటే ఎంత ప్రేమో!’ ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేయించుకుంది.. సో గ్రేట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా భార్య అనిత చనిపోయిన కొన్నాళ్ల పాటు ఒంటరిగానే కాలం గడిపారు దిల్ రాజు. అయితే లాక్ డౌన్ టైంలో తేజస్విని (వైఘా రెడ్డి) అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఓ బాబు కూడా పుట్టాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దిల్ రాజు నిర్మాతగా నితిన్ హీరోగా తమ్ముడు పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. వకీల్ సాబ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *