నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ చేసుకోవడమే ఇందుకు కారణం.ఆగస్టు 8న నాగ చైతన్య, శోభిత ల ఎంగేజ్మెంట్ వేడుక ఫోటోలు నాగార్జున షేర్ చేశారు. నూతన జంటను ఆశీర్వదించాడు. ఇక నాగ చైతన్య మాజీ భార్య సమంత ఈ విషయం పై ఎలా రియాక్ట్ అవుతుంది అని నెటిజన్లు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక చైతన్య-శోభిత ఎంగేజ్ మెంట్ ఫొటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాబోయే దంపతులను ఆశీర్వదించాలని కోరారు.
దీంతో ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కాబోయే జంటకు అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియలో నాగ చైతన్య- శోభితల గురించి ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే వీరిద్దరి వయసు ఎంత? ఇద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందనే విషయాలను నెటిజన్లు ఆరాతీస్తున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్..ఇలా అన్ని భాషల సినిమాల్లో నటించి మెప్పించిన శోభిత ధూలిపాళ్ల మన తెలుగు అమ్మాయే. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఏపీలోని తెనాలి. 1992 మే 31న శోభిత జన్మించింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లు. మరోవైపు అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య 1986 నవంబర్ 23న హైదరాబాద్ లో పుట్టాడు. ప్రస్తుతం చైతు వయసు సుమారు 37 ఏళ్లు.ఈ లెక్కన చూస్తే నాగ చైతన్య, శోభితల మధ్య ఏజ్ గ్యాప్ కేవలం 5 ఏళ్లు మాత్రమే.
గతంలో పలు సార్లు జంటగా కనిపించారు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట రూమర్స్ తెగ వైరలయ్యాయి. గతేడాది లండన్లో ఓ రెస్టారెంట్లో కనిపించడం, ఆ తర్వాత ఈ ఏడాది జూన్లో వీరిద్దరు విదేశాల్లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి డేటింగ్ వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడీ రూమర్లనే నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. త్వరలోనే వీరి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.