కరీంనగర్ జిల్లా మంథనిలోని బిక్షేశ్వర స్వామి ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయంలో ద్వారపాలకునిగా హనుమంతుడు ఉండటం మరో విశేషం. అయితే రెండు ప్రదేశాల్లో మాత్రం పశ్చిమాభిముఖంగా వెలసిన శివ లింగాలు ఉన్నాయి. అది ఒకటి వారణాసిలోని విశ్వేశ్వరుడి ఆలయం కాగా, మరొకటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఉండటం మన అదృష్టం. కరీంనగర్ జిల్లా మంథనిలోని బిక్షేశ్వర స్వామి ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది.
అంతేకాదు ఈ ఆలయంలో ద్వారపాలకునిగా ఆంజనేయుడు ఉండటం మరో చెప్పుకోదగ్గ అంశం. ఇక్కడ బిక్షేశ్వరునికి అభిషేకం చేసి, జోలె పట్టి బిక్ష వేడుకుంటే ఎంతటి కష్టాలైన తొలిగిపోతాయని భక్తులు విశ్వశిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు ఏటా పలువురు ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖులు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుల చెల్లించుకుంటారు. తెలంగాణ రాష్టం పెద్దపల్లి జిల్లా మంథని… ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామం. అంతేకాదు ఇక్కడ ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లుతుంది.

గ్రామానికి పడమర ఒక చిన్న సరస్సు ఉంటుంది… తూర్పున అటవీ ప్రాంతం విస్తరించింది. ఉత్తర భాగాన పవిత్ర గోదావరి… దక్షిణ భాగాన బొక్కలవాగు అని పిలవబడే చిన్న నది వాగీశ్వరి ఉంటుంది. గ్రంథాలలో మంథని ” మంత్రపురి ” అని చెప్పబడింది. సహస్ర లింగాలు గ్రామమంతా చెల్లాచెదురుగా పడి ఉండటం వలన మంత్రకూట సహస్ర లింగ స్థానం” అని ప్రసిద్ది. మంత్రకూట పదం మంత్రపురముగా మంథెన్నగా మంథెనగా …. ఆ తర్వాత మంథనిగా స్థిరపడిందని చరిత్రకారులు చెబుతున్నారు.
మంథని అంటే మజ్జిగ కుండ అని కూడా చెబుతుంటారు. చాళుక్యులు, కాకతీయులు పాలించిన మంథని పరిసర ప్రాంతాల్లో శిథిలమైన పురాతన దేవాలయాలు, విగ్రహాలు గత వైభవానికి నిదర్శనంగా కనిపిస్తాయి.. దేవాలయాలు దాదాపు 20 పైగా ఉన్నాయి. విగ్రహాలు చిహ్నాలు మాత్రం వేలాదిగా ఉన్నాయి. ఆలయాల్లో కొన్ని ఉనికిని కోల్పోయి చరిత్రగా మాత్రమే మిగిలిపోయాయి. కొన్ని ఆలయాలు అవశేషాలుగా మిగిలి ఉన్నాయి.