డబ్ల్యూహెచ్ఓ వైట్ ఉప్పు వాడకాన్ని ప్రపంచం మొత్తానికి ఆందోళన కలిగించే విషయంగా అభివర్ణించింది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ప్రతిరోజూ 10.8 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని, దానిని 5 గ్రాములకు తగ్గించాలని WHO తన నివేదికలో వెల్లడించింది. అయితే రాక్ సాల్ట్ ని ఎక్కువగా శుభ్రత కోసం ఉపయోగిస్తుంటారు. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల రాక్ సాల్ట్‌ను పూజా గదిలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం..పాల సముద్రాన్ని మథించినప్పుడు మహాలక్ష్మి అవతరించింది.
ఆ సముద్రంలో ఉప్పు ఉండటం వల్ల రాక్ సాల్ట్‌ను ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. దీన్ని ఎల్లప్పుడూ మట్టికుండ లేదా పోర్సిలైన్ పాత్రలో పెట్టాలి. కుడి చేతివైపు ఉంచడం మంచిది. ఇది ఎప్పుడూ అంచున కాకుండా సులభంగా అందుకునేలా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహానికి సూచికగా భావిస్తారు కాబట్టి రాక్ సాల్ట్ డబ్బా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. శుభ్రమైన చేతులతోనే తీసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాత కడగకూడదు. కానీ శుక్రవారం లేదా మంగళవారం కడగడం శ్రేయస్కరం.
చెడు శక్తులను తొలగించడం..ఇంట్లోని చెడు శక్తులు, ప్రతికూల శక్తులను నివారించాలంటే ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఒక చిటికెడు రాక్ సాల్ట్ కలిపి తుడవడం మంచిది. అదే విధంగా ఒక ఎర్రటి బట్టలో రాక్ సాల్ట్‌ను కట్టి దారంతో బిగించి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. దీని వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. బంగారు ఆభరణాలకు రాక్ సాల్ట్.. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను తిరిగి పొందడం కష్టంగా ఉంటే రాక్ సాల్ట్‌తో ఒక సాధారపరిహారం చేయాలి. ఈ పరిహారాన్ని ఉదయం 10 గంటల ముందు లేదా సాయంత్రం 6 గంటల తర్వాత చేయాలి.
పూజా గదిలో ఒక గాజు గిన్నె తీసుకుని కొత్తగా కొనుగోలు చేసిన రాక్ సాల్ట్‌ను అందులో నింపాలి. ఆపై కొద్దిగా పసుపు పొడి, కుంకుమ చల్లి, ఈ గిన్నెను మహాలక్ష్మి చిత్రానికి సమీపంలో ఉంచాలి. రెండు గంటలు తర్వాత ఈ గిన్నెను తీసుకుని బంగారు ఆభరణాలు ఉంచే అల్మారాలో పెట్టాలి. రాక్ సాల్ట్, పసుపు, కుంకుమ ఈ మూడు మహాలక్ష్మి అనుగ్రహానికి సూచికలు. ఇది చేసేటప్పుడు మనసారా కోరికను ప్రార్థించాలి. దీనివల్ల తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను త్వరగా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.