సహనం కోల్పోయిన స్టార్ హీరో, అభిమాని మొబైల్‌ను జేబులో వేసుకెళ్లిపోయిన స్టార్ హీరో. వైరల్ వీడియో.

divyaamedia@gmail.com
2 Min Read

ఉన్ని ముకుందన్, ఏయిర్ పోర్ట్‌లో వెళ్తుండగా ఒక వ్యక్తి.. ఉన్ని ముకుందన్‌ను వీడియో తీస్తున్నాడు. మోహం దగ్గర పెట్టి వీడియో తీస్తుండటంతో.. ఆ వ్యక్తి ఫోన్ లాక్కుని తన జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అయితే ఈ మధ్యన మలయాళంలో సోలో హీరోగానూ బాగా సక్సెస అవుతున్నాడు ఉన్నీ ముకుందన్. ముఖ్యంగా మార్కో సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్ దక్కించుకున్నాడు. భారతీయ సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది ది మోస్ట్ వయలెంట్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది.

మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ మార్కో సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక హీరో ఉన్ని ముకుందన్ పేరు కూడా ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇదిలా ఉంటే ఈ మార్కో హీరోకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సామాజి మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఇందులో ఒక మాల్ లో కనిపించిన ఉన్నీ ముకుందన్ తో ఫొటో దిగేందుకు ఒక అభిమాని ప్రయత్నించాడు.

ఇందుకోసం హీరో ముఖం మీదే కెమెరా పెట్టేశాడు. దీంతో ముకుందన్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. కోపం కట్టలు తెంచుకోవడంతో సదరు అభిమాని ఫోన్ ను లాక్కొని జేబులో పెట్టేసుకుని వెళ్లిపోయడు. అయితే అభిమాని వేడుకోవడంతో కొద్ది గా ముందుకు వెళ్లాక ఫోన్ ను తన కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇది ఓల్డ్ వీడియోనా? కొత్త వీడియోనా? అన్నది క్లారిటీ అయితే రావడం లేదు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఉన్నీ ముకుందన్ మరీ ఇంత యారోగెంట్ గా ప్రవర్తించాల్సి కాదంటూనే, అభిమాని తప్పు కూడా ఉందంటున్నారు. మరీ అలా మొహం మీదే కెమెరా పెట్టడం ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *