పంచ్ డైలాగులతో థియేటర్లలో నవ్వులు పూయించగల సత్తా ఉన్న నటుడు. ఆయన కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెరపై ఆయన కనిపిస్తే చాలు, నవ్వులు గ్యారెంటీ. అంత సహజంగా, అలవోకగా నటించే ఆయన టాలెంట్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎం.ఎస్. నారాయణ సినిమాల్లోకి రాకముందు ఆయన లెక్చరర్‌గా పనిచేసేవారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఏకంగా 750 సినిమాలకు పైగా నటించి రికార్డు క్రియేట్ చేశాడు.

ఆయన 1992లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. 2015వరకు ఏకధాటిగా సినిమాలు చేశాడు. కేవలం 23 ఏళ్లలో 750 సినిమాల్లో నటించాడంటే ఆయన ఎంత బిజీ ఆర్టిస్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎమ్.ఎస్ నారాయణ తన కెరీర్‌లో 5 నంది అవార్డులు, 1 ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక చివరగా నారాయణ.. ఆరడగుల బుల్లెట్ సినిమాలో నటించాడు. ఈ సినిమా 2021లో రిలీజైంది. కాగా, ఆయన బ్రతికున్నప్పుడు.. ఈ సినిమా షూటింగ్ జరిగింది.
ఇక ఎమ్.ఎస్ నారాయణ కొడుకు కూడా టాలీవుడ్‌లో క్రేజీ హీరో అనే విషయం చాలా మందికి తెలియదు. అవును.. ఆయన పేరు విక్రమ్. ఈయన కొడుకు అనే సినిమాలో హీరోగా నటించాడు. అప్పట్లో ఈ సినిమా బాగానే ఆడింది. కానీ విక్రమ్.. ఈ ఒక్క సినిమాలో మాత్రమే హీరోగా నటించాడు. సుమన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో గంగోత్రి హీరోయిన్ అధితి అగర్వాల్ నటించింది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కూడా ఎమ్.ఎస్ నారాయణనే. S నారాయణకు కొడుకుతో పాటు కూతురు కూడా ఉంది. కూతురు తెలుగులో ఫేమస్ డైరెక్టర్. సాహేబా సుబ్రమణ్యం, న్యూసెన్స్, హరికథ వంటి సినిమాలకు దర్శకత్వం వహించింది. అంతేకాదు ఒక సినిమాలో చిన్న గెస్ట్ రోల్‌లో కూడా నటించింది.