రష్మి జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా యాంకరింగ్ గానే చేస్తూ ఉన్నది. అయితే గతంలో రష్మీ యువ అనే ఒక సీరియల్ లో కూడా నటించిందట. అందుకు సంబంధించి ఒక వీడియో నిన్నటి నుంచి వైరల్ గా మారుతున్నది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. లేటెస్ట్ వీడియోస్ సంగతి అటుంచితే ఒక్కోసారి ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నట్టుండి వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఇలాగే యాంకర్ రష్మీ, ఎస్ఎస్ రాజమౌళికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడమే గాక నెట్టింట హాట్ టాపిక్ అయింది.
ఇది గమనించిన యాంకర్ రష్మీ తన కోరిక బయటపెడుతూ నాగార్జునకు ఓ రిక్వెస్ట్ పెట్టింది. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన దర్శకుడు ఎవరంటే, అది ఎస్ ఎస్ రాజమౌళినే అంటారంతా. కానీ ఆయన తన కెరీర్‌ను నేరుగా సినిమాల ద్వారా కాకుండా, సీరియల్స్ ద్వారా ప్రారంభించారని చాలా తక్కువ మందికే తెలుసు. ఇదే విషయమై అనూహ్యంగా ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బుల్లితెర గ్లామర్ యాంకర్ రష్మీ, రాజమౌళి కలిసి నటించిన ఓ సీరియల్ నుండి కొన్ని ఫన్నీ క్లిప్స్ అకస్మాత్తుగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఇది చాలా ఓల్డ్ వీడియో కావడం.. ప్రస్తుతం మంచి పాపులారిటీ ఉన్న రష్మీ- రాజమౌళి కనిపించడంతో ఈ కలయిక ఎప్పుడు జరిగింది? అని తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సదరు వైరల్ క్లిప్‌పై రష్మీ కూడా స్పందించింది. “తమ యువ సీరియల్ నుంచి ఇవన్నీ చాలా మంచి మెమొరీలు” అంటూ, మళ్ళీ ఆ సీరియల్ యూనిట్‌తో రీయూనియన్ ఎపిసోడ్ చేయాలని అక్కినేని నాగార్జునను ప్రత్యేకంగా కోరింది యాంకర్ రష్మీ.
సో ఇప్పుడు, నాగ్ నిజంగానే ఆ ప్లాన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్ బడా దర్శకుల్లో ఒకరిగా రాజమౌళి కెరీర్ కొనసాగుతుండగా.. పలు టీవీ షోస్ చేస్తూ దూసుకుపోతోంది రష్మీ గౌతమ్.
Thankyou
— rashmi gautam (@rashmigautam27) February 19, 2025
Yes good old memories from Yuva serial days
Wish they do a reunion episode @iamnagarjuna sir plsss https://t.co/9Bn4w7XKqz