అతనిపై తన ప్రేమ బయటపెట్టిన నిహారిక, ఆ సడెన్ సర్‌ప్రైజ్ ఏంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ చురుగ్గా ఉండే నిహారిక తనకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఓ స్టోరీని షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. తాను అతడిని ప్రేమిస్తున్నామని నేరుగా చెప్పేసింది. అయితే ఢీ ప్రోగ్రామ్‌ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక, ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాల్లో నటించింది. కొన్ని టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లలో కూడా మెరిసింది.

ఆ తర్వాత 2020 డిసెంబర్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. ఆ తర్వాత రెండేళ్లు కూడా కాకుండానే విడాకులు తీసుకుంది. దీని వెనుక రీజన్స్ ఏంటనేది బయటలు రాలేదు. అప్పటినుంచి మళ్లీ కెరీర్‌పై దృష్టిపెట్టింది నిహారిక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించి నిర్మాతగా మారింది. గతేడాది కమిటీ కుర్రోళ్లు అనే మూవీ రూపొందించి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమా నిర్మాణంలో ఉంది. కాగా విడాకుల అనంతరం నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతోందని, ఓ వ్యక్తితో ప్రేమలో కూడా ఉందనే వార్తలు వైరల్ అయ్యాయి.

సరిగ్గా ఈ పరిస్థితుల్లో నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఓ చిన్నారి నిహారిక గురించి రాసిన నోట్‌ను షేర్ చేసింది నిహారిక. ఇందులో “మైనర్ పాస్‌పోర్ట్ నోట్‌బుక్, నేనే వాడిని ప్రేమిస్తున్నా. అంబటి భార్గవి, నువ్వు మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి రావొద్దు” అని రాసి ఉంది. ఈ పోస్ట్‌కు నిహారిక రెడ్ హార్ట్ సింబల్‌ కూడా జత చేసింది. దీంతో ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు? సడెన్ గా నిహారిక ఎందుకు ఇలా పోస్ట్ చేసింది? అనే విషయాలు నెట్టింట చర్చనీయాంశం అయ్యాయి.

విడాకుల తర్వాత తన పూర్తి ఫోకస్ కెరీర్ పైనే పెట్టేసింది నిహారిక. ఈ మేరకు కీలక అడుగులేస్తోంది. మరోవైపు నిహారిక రెండో పెళ్లి గురించి ఎప్పటి నుంచో రూమర్స్ వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఆ టాలీవుడ్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది, ప్రొడ్యూసర్ కొడుకుతో పెళ్లి అంటూ రకరకాల ఇష్యూస్ బయటకొచ్చినా వీటిపై మెగా టీమ్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *