మనం కాల్ చేయగానే వచ్చే అవేర్నెస్ వాయిస్ ఈమెదే, మనల్ని ఎంతలా ఇరిటేషన్ చేస్తుందో చుడండి.

divyaamedia@gmail.com
2 Min Read

ఉద్యోగాల పేరుతో భారతీయులను మయన్మార్‌కు రప్పించుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు.. అక్కడ వారితో సైబర్‌ నేరాలు చేయిస్తున్నారు. ఈ పని చేయడానికి నిరాకరించిన వారిని ముందుగా చీకటి గదుల్లో నిర్బంధిస్తున్నారు. అయినా మాట వినకపోతే కరెంట్‌ షాక్‌లు పెడుతున్న సందర్భాలు ఉన్నాయని బాధితుల చెర నుంచి విముక్తుడైన మధుకర్‌రెడ్డి తన కుటుంబసభ్యులకు ఫోన్‌ ద్వారా తెలిపారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేటుగాళ్లు మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారు. ఆఫర్స్ వచ్చాయని, మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, లక్కీ డ్రాలో మనీ గెల్చుకున్నారు అంటూ ఫోన్స్ చేసి డబ్బులు కాజేస్తున్నారు.

ఎంతజాగ్రత్తగా ఉన్న కూడా సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేస్తూనే ఉన్నారు. వీరి నుంచి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహనా కలిపిస్తూ.. ప్రభుత్వం, పోలీసు అధికారులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు. అయితే ఈ మధ్య ఫోన్ లోనూ ప్రజలకు జాగ్రత్త చెప్తూ అవగాహనా కలిపిస్తున్నారు. ఫోన్ లో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటూ అవేర్నెస్ ఇస్తున్నారు. ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా సోషల్ మీడియా లేదా .. తెలియని గ్రూపుల నుంచి పెట్టుబడి చిట్కాలు.. అంటూ ఓ లేడీ వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ మనకు అవగాహనా కలిపించడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ..

ప్రతిసారి ఫోన్ చేయగానే ఇదే వాయిస్ వినిపించడంతో కొంతమంది తిట్టుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఇంతకూ ఆ వాయిస్ ఎవరిదో తెలుసా.? ఆమె వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. ఆమె ఎవరంటే. ప్రతిరోజు మన ఫోన్ లో వినిపించే వాయిస్ ఈ అమ్మాయిదే.. ఆమె పేరు అమృత. రేడియో మిర్చీలో జాకీగా చేస్తుంది. ప్రతిరోజు తన వాయిస్ తో ఎంతోమందిని అలరిస్తూ ఉంటుంది అమృత. ఇక ఇప్పుడు ప్రతిరోజు మన ఫోన్ లో వినిపిస్తుంది. తాజాగా అమృత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ గా మారింది.

“సోషల్ మీడియా లేదా .. తెలియని గ్రూపుల నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావొచ్చు.. ఫ్రెండ్స్ నా వాయిస్ కు నేనే ఇరిటేట్ అవుతున్నాను. మొన్నటి వరకు మా అమ్మ నాన్న కూడా ఇది మా అమ్మాయి వాయిస్ అని సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఏంటి ఈ గోల మాకు అంటున్నారు. కానీ ఏం చేస్తాం నా చేతిలో ఏం లేదు” అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *