ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ‘దేవరాట్టం’ అనే చిత్రంలో కనిక నటించింది. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియడంతో వారే కూర్చొని వీరిద్దరికి వివాహం చేశారు. అయితే వీరి ప్రేమ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్నేహన్, కనిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అనంతరం దగ్గరుండి వీరి పెళ్లి జరిపించారు. ఈక్రమంలోనే స్నేహన్, కనికలు ఇటీవల అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. కనిక ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన వెంటనే ఈ జంట కమల్ హాసన్ దీవెనల కోసం ఆయన ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా ఇద్దరూ అమ్మాయిలు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కమల్ ఆశీర్వదించారు. ఆపై వారిద్దరికీ స్వయంగా ఆయనే బంగారు గాజులు తొడిగారు.
ఆపై కనిక, స్నేహన్లతో పాటు పిల్లలకు పట్టు వస్త్రాలు కూడా అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పాటల రచయితగా స్నేహన్కు తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కూడా ఆయన పలు సినిమా పాటలకు సాహిత్యం అందించారు. తరుణ్ ప్రియమైన నీకు, మన్మధ, ఆటోగ్రాఫ్,ఆడుకాలం,ఆకాశం నీ హద్దురా, సామీ తదితర హిట్ సినిమాలకు పాటలు రాశారు. అలాగే రజనీకాంత్, సూర్య, విజయ్, అజిత్,కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు స్నేహాన్ పనిచేశారు.
ఇక కమల్ హాసన్ స్థాపించిన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయ్యంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో స్నేహాన్ తమిళనాడులోని శివగంగ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఓడిపోయారు.
காதலர் தினத்தில் …
— கன்னிகா சினேகன் @Kannika snekan (@KannikaRavi) February 14, 2025
எங்கள் தங்க மகள்களுக்கு
தங்க வளையல்களோடு .
"காதல்" கன்னிகா சினேகன் என்ற பெயரையும்
"கவிதை " கன்னிகா சினேகன் என்ற
பெயரையும் ..
அணிவித்து வாழ்த்திய, நம்மவர் எங்களின் அன்பு தலைவர்
பத்ம பூஷன் @ikamalhaasan கமல்ஹாசன் அவர்களுக்கு எங்கள் அன்பின் நன்றிகள்🙏 pic.twitter.com/PX8ezvKwo9