కృష్ణకు ముగ్గురు కుమార్తెలు కాగా మంజుల ఘట్టమనేని ఒకరు. ఈమె నటి కూడాను. షో అనే ప్రయోగాత్మక చిత్రంలో మంజుల హీరోయిన్ గా చేసింది. నీలకంఠ దర్శకత్వం వహించిన షో చిత్రంలో రెండు పాత్రలే ఉంటాయి. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మహేష్ మేనకోడులు ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. మహేష్ బాబు అక్క మంజుల సైతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
ఇప్పటివరకు ఆమె ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రలు పోషించింది. తాజాగా మంజుల ఘట్టమనేని కూతురు..మహేష్ బాబు మేనకోడలు జాహ్నవి స్వరూప్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఆ అమ్మాయి అచ్చం హీరోయిన్ లా కనిపిస్తుంది. సుధీర్ బాబు తనయుడు చరిత్ తో కలిసి జాహ్నవి ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఆ ఫోటోలో జాహ్నవి, చరిత్ ఇద్దరూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అంతకు ముందు తల్లిదండ్లులతో కలిసి ట్రెడిషనల్ వేర్ లో జాహ్నవి కనిపిస్తున్న ఫోటోస్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి.
మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని అనేక చిత్రాల్లో నటించింది. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో హీరో అక్కగా కనిపించింది. అలాగే నిర్మాతగానూ రాణిస్తున్నారు. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి పోకిరి సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు. అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు మంజుల. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఫ్యామిలీ విషయాలను పంచుకుంటారు.