అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘కితకితలు’ సినిమాలో గీతా సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాలో బక్క పలుచని భర్తకు లావైన భార్య పాత్రలో గీతా సింగ్ నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాతో స్టార్ కమెడియన్‌గా గీతా సింగ్‌కి పేరు దక్కింది. టాలీవుడ్‌లో చిన్నా పెద్ద సినిమాలు కలిపి దాదాపుగా 60 సినిమాలు చేసింది.
ఈమె కమెడియన్‌గా పలు అవార్డులను, రివార్డులను సైతం దక్కించుకుంది. అయితే ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చేతికి అందివచ్చిన కుమారుడు సడెన్ గా యాక్సిడెంట్ లో చనిపోవడంతో గీతా సింగ్ కోలుకోలేకపోయింది.
ఫిబ్రవరి 18 గీతాసింగ్ కుమారుడి వర్ధంతి. ఈ సందర్భంగా తన కొడుకుకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిందామె. ‘తన కొడుకు తనతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా సింగ్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.