అనసూయ అనే 82 ఏళ్ల వృద్ధురాలి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆమె తన కుమారుడు మోహన్ శ్రీనివాస్‌తో కలిసి మల్కాజిగిరిలో నివాసం ఉంటుంది. అయితే అనసూయ గత కొన్ని నెలలుగా వృద్ధాప్యం కారణాలతో మంచం పట్టింది. అయితే హైదరాబాద్ లోని మల్కాజిగిరిలో అనసూయ అనే 82 ఏళ్ల వృద్ధురాలు.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి.
తన కుమారుడు మోహన్ శ్రీనివాస్‌తో కలిసి నివాసం ఉంటోంది. అయితే అనసూయ గత వృద్ధాప్యంతో కొన్ని నెలలుగా మంచానికే పరిమితమైంది. ఈ పొరపాటు అస్సలు చేయకండి! సోదరి గృహప్రవేశం ఉండటంతో ఫిబ్రవరి 7న శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి బెంగళూరు వెళ్లాడు. తల్లిని చూసుకునేందుకు ఒక కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేశాడు.
అయితే ఫిబ్రవరి 11 తెల్లవారుజామున హైదరాబాద్‌కు తిరిగి వచ్చేందుకు శ్రీనివాస్ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో వారింట్లో అద్దెకు ఉంటున్న సంతోష్ అనే వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయని శ్రీనివాస్‌కు చెప్పాడు.
దీంతో శ్రీనివాస్ వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి విషయం చెప్పాడు. అనసూయ గదిలో పొగలు రావటంతో పాటుగా ఆమె అపస్మారకస్తితిలోకి వెళ్లటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు ఆమె మరణించింది.