తిరుపతి పోలీసుల అదుపులో మంచు మనోజ్ అరెస్ట్, అసలేం జరుగుతుంది.

divyaamedia@gmail.com
1 Min Read

తిరుపతిలోని తన ఇంట్లో ఉన్న మనోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని భాకరాపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు కుటుంబ వివాదంలో మోహన్ బాబు చేసిన ఫిర్యాదుకు అనుగుణంగా జరిగిందని తెలుస్తోంది. అయితే ఇక గత గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు అందరికి తెలిసినవే. ఆస్తలు పంపకాలకు సబంధించిన స్టార్ట్ అయిన గొడవ.. ఇంట్లో రాజుకుని వీధిలో మంటలు రగిల్చింది. అది కాస్తా కోర్డ్ లు కేసుల వరకూ వెళ్ళింది.

ఈలోపు జర్నలిస్ట్ పై దాడి. మోహాన్ బాబుపై కేసు, క్షమాపణాలు ఇలా జరుగుతండగా.. హైదరాబాద్ ఇంటిని వీడి తిరుపతిలో తన యూనివర్సిటీలో ఉంటున్నాడు మోహన్ బాబు. ఇక అక్కడికి కూడా మనోజ్ వస్తుండటంతో మోహన్ బాబు కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇక మంచు మనోజ్ రీసెంట్ గా జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు.. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.

అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. అంతే కాదు తన బలం చాటుకోవడం కోసమో ఏమో తెలియదు కాని.. మంచు మనోజ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ను కలిశారు నారా లోకేష్ ఈరోజు కుటుంబంలో కలిసి కుంభమేళాకు వెళ్లారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలియడంతో మంచు మనోజ్ వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇది జరుగుతుండగానే మనోజ్ ను అరెస్ట్ చేశారన్న వార్తలు వైరల్ అయ్యాయి. మంచు వారి గొడవలు ఎప్పుడు కొలిక్కి వస్తాయో తెలియదు కాని… గత కొన్ని రోజులుగా తండ్రి కొడుకుల మధ్య వార్ మాత్రం నాన్ స్టాప్ గా జరుగుతూనే ఉంది. ఈ కేసుల్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *