సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పలు యాడ్ లలో పనిచేసిన ఈమె ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకొని.. ఆ తర్వాత తన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. అయితే స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంతకు ఇందులో ఏముందంటే.. ఓ వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్లు.. పూలు వికసించిన ఫోటోలు షేర్ చేసింది సమంత. అంతేకాకుండా దీనికి లవ్ సింబల్‌ను కూడా జోడింంచింది. దీంతో సామ్ మళ్లీ ప్రేమలో పడిందన్న గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ఫ్యామిలీమ్యాన్, సిటాడెల్ డైరెక్టర్.. రాజ్ నిడిమోరుతో సమంత లవ్‌లో ఉన్నట్లుగా గతకొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే దీనిపై వీరిద్దరూ ఒక్కమాట కూడా మాట్లాడకుండా తమ పని తాము చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. చైతూతో విడాకుల అనంతరం.. రాజ్ నిడిమోరుకు చాలా క్లోజ్ అయింది సమంత. ఇద్దరు బహిరంగగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.ఈ క్రమంలో వీరి డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాకు చెందిన రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. ఇంజనీరింగ్ స్టడీ చేసిన రాజ్ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ తన ఫ్రెండ్ కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్స్మ్ అనే బ్యానర్‌ను స్థాపించారు. మొదటగా షాదీ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బాగా ఫేమస్ అయ్యారు.
Some happy news coming our way it seems dear #Samians from our queen @Samanthaprabhu2#Samantha#SamanthaRuthPrabhu𓃵 pic.twitter.com/V40i6ucB7F
— Chary'z Tweetz 🐦 (@Urs_Truly_MK) February 14, 2025