ఎట్టకేలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కూతురు క్లీంకార ఫేస్ చూడాలన్న మెగా ఫ్యాన్స్ కోరిక తీరింది. తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియోలో ఆమె ఫేస్ రివీల్ అయింది. చరణ్, ఆమెను ఎత్తుకుని వెళుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే మెగా ప్రిన్సెస్ క్లింకార కొణిదెల ముఖాన్ని చూడడానికి మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే రామ్ చరణ్- ఉపాసన ఇప్పటివరకు తమ కూతురి ఫేస్‌ను కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ చూపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తమ బిడ్డ ఫొటోలు షేర్ చేసినా ముఖం కనిపించకుండా బ్లర్ చేయడం లేదా ఎమోజీలతో ఫేస్ కవర్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక ఇటీవల ఆహా బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు హాజరైన రామ్ చరణ్ తనను నాన్న అని పిలిచిన తర్వాతే క్లింకార ఫేస్ ను అందరికీ చూపిస్తానన్నాడు.
అయితే ఈ చర్చ జరిగి సరిగ్గా నెల రోజులు కూడా గడవకముందే మెగా ప్రిన్సెస్ క్లింకార ఫేస్ రివీలైంది. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ తన కూతురిని ఎత్తుకొని నిల్చున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అవి కాస్తా క్షణాల్లోనే వైరల్ గా మారాయి. వీటిని చూసిన మెగాభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. క్లింకార సూపర్ క్యూట్ గా ఉందంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
klinkara baby ❤️
— Eswar 🏂 (@always_siddu0) February 14, 2025
pic.twitter.com/qBw21MlmOk