జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సపరేటు క్రేజ్‌ను యాంకర్ రష్మి క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. అయితే యాంకర్ రష్మి గౌతమ్ లేటెస్ట్గా తన ఇన్‌స్టా స్టోరీలో ఓ ఫోటో షేర్ చేసింది.
ఈ పోస్ట్‌లో రష్మి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో తన అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే రష్మి షేర్ చేసిన ఫోటోకి “నేను సర్జరీ కోసం రెడీ అయ్యాను. నా భుజాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంది. దాని వల్ల నాకు ఇష్టమైన డాన్స్ చేయలేకపోతున్నాను. దానికి నేను దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ సర్జరీ అయ్యాక పూర్తిగా సెట్ అవుతుంది.. మళ్ళీ నేను డాన్స్ చేయగలుగుతాను” అంటూ క్యాప్షన్ పెట్టింది. రష్మీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దాంతో తన ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ.. ఆమె త్వరగా కోలుకోవాలని రిప్లైలు పెడుతున్నారు. నటిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ఒరిస్సా బ్యూటీ.. ప్రస్తుతం స్టార్ యాంకర్‌గా తన హవాను కొనసాగిస్తోంది. తిరిగి వచ్చి ఆమె తన మరింత ఉత్సాహంతో కంటిన్యూ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.