మా ఫ్యామిలీలో లేడిస్ ఎక్కువగా ఉన్నారని చిరంజీవి తెలిపారు.మా ఇంటి నిండా ఆడవాళ్లు ఉండటంతో నేను లేడిస్ హాస్టల్‌కు వార్డెన్ మాదిరిగా ఉన్నట్టు ఉందని చెప్పుకొచ్చారు. అందుకే రామ్ చరణ్‌ను మగపిల్లాడిని కనమని చెబుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు.ఈ సమయంలో ఆయన తన తాత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నా చిన్నప్పుడు ఎవరి పోలికలు వచ్చిన ఫర్వాలేదు.
అయితే నీకు ఎవరి పోలికలు వచ్చినా పర్వాలేదు కానీ ఆయన పోలికలు బుద్దులు మాత్రం రాకూడదు అనేవారు.. ఎందుకంటే ఆయన మహా రసికుడు అని చిరంజీవి కామెంట్స్ చేశారు. దీనితో అక్కడున్న వారంతా నవ్వేశారు. నాకు ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. అంటే ఆయనకి ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరి మీద కోపం వస్తే మూడో ఆవిడ దగ్గరకి వెళ్లేవారు.
నాలుగు, ఐదు కూడా ఉన్నాయో నాకు తెలియదు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. నేను సినిమాల్లోకి వెళుతుంటే.. అక్కడ నీకు చాలా అవకాశాలు ఉంటాయి. మీ తాతలా మాత్రం కావద్దు అని ఇంట్లో వాళ్ళు హెచ్చరించారు. ఆయన పోలికలు నాకు రాలేదు అందుకు సంతోషం. ఆయన్ని ఆదర్శంగా కూడా తీసుకోలేదు అని చిరంజీవి తెలిపారు.
ఆయన రసికుడైనప్పటికీ దానధర్మాలు ఎక్కువగా చేసేవాడు. ఆ గుణం మాత్రం తనకి వచ్చింది అని చిరంజీవి తెలిపారు. చిరంజీవి తన ఫ్యామిలీ సీక్రెట్ ని రివీల్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.