గత కొన్ని రోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో తనను ఒక నటుడు ఇబ్బంది పెట్టాడు అంటూ చెప్పి వార్తల్లో నిలిచింది. ఇక ఆ వార్తల నుంచి ఇంకా అభిమానులు బయటపడక ముందే మళ్లీ ఇప్పుడు ఈమె కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళితే, సంజన గల్రానీ డ్రగ్స్ కేసులో గతంలో అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సంచలన విజయం సాధించిన దండుపాళ్యం సినిమాల్లోనూ నెగెటివ్ పాత్రలో అద్భుతంగా నటించింది. సినిమాల సంగతి పక్కన పెడితే.. న సంజన గల్రానీ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు.
ఆమె మూడు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించింది. అయితే బెయిల్పై బయటకు వచ్చింది. సంజనా అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. అయితే ఇటీవల ఆ కేసును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సీసీబీ పోలీసులు ఇప్పుడు సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీని వలన సంజన గల్రానీ మళ్ళీ ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ప్రభుత్వ స్థాయిలో ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించారు.
అప్పీలుకు సంబంధించి పిటిషన్ ను కూడా సిద్ధం చేశారు. ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చిన వెంటనే పిటిషన్ దాఖలు చేస్తాం’ అని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ అన్నారు. మరి ఈ విషయంపై సంజన ఎలా స్పందిస్తుందో చూడాలి. సంజన గల్రానీ కన్నడ, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. కొన్నేళ్ల క్రితమే వివాహం చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 2020 లాక్ డౌన్ సమయంలో బెంగుళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని పెళ్లి చేసుకున్న సంజన సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. 2022లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సంజన తమ ఫ్యామిలీకి పూర్తిగా టైమ్ కేటాయించింది.