వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు. గతంలో రవితేజ పలు హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు, తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టులుగా నటించారు. అందరి హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తున్నారు. అయితే అసలు రవితేజ సినిమాలకు ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే.
ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర జాతరే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవితేజ. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రవితేజ. అలాగే కొత్త దర్శకుడితో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజకు సంబందించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ ఫొటోలో రవితేజ లుక్ అభిమానులకు షాక్ ఇస్తుంది. మాస్ రాజా ఈ ఫొటోలో గుర్తుపట్టలేనంతగా ఉండి షాక్ ఇచ్చారు. ఈ ఫొటోలో రవితేజ బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు. అలాగే మొఖంలోనూ తేడా కనిపిస్తుంది. నిద్ర లేచిన వెంటనే దిగిన పిక్ ఇది. అయితే ఈ ఫోటో లేటెస్ట్ ది కాదు అని తెలుస్తుంది. గతంలో వైరల్ అవుతున్న ఫోటో ఇది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
mastaru @RaviTeja_offl hairstyle adhirindhi🤣❤️#Massjathara #raviteja pic.twitter.com/mU1wWSxc4x
— చంటిగాడు లోకల్ 😎 (@Harsha_offl3) February 4, 2025