భార్యతో లైంగిక సంబంధం విషయంలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలో భార్యకు ఇష్టం లేకుండా తనతో అసహజ శృంగారం లాంటివి చేయడాన్ని నేరంగా భావించలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. అయితే ఒక మహిళ 15 సంవత్సరాలు దాటినప్పటి నుండి భర్త ఆమెతో శృంగారం చేయడం నేరంగా పరిగణించబోదని కోర్టు తెలిపింది. భర్త సమ్మతి లేకుండా లైంగిక సంబంధానికి ఒత్తిడిచేసినా, అది అత్యాచారం లేదా అసహజ లైంగిక చర్యలుగా పరిగణించలేమని పేర్కొంది. ఇది ఎక్కడో జరిగింది. కాదు మన పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన ఓ కీలక తీర్పు.
ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తన తాజా తీర్పులో, భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం లాంటివి చేస్తే నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్ నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. భార్య వయస్సు 15 సంవత్సరాలు దాటినప్పటి నుండి భర్త ఆమెతో శృంగారం చేయడం నేరంగా పరిగణించబోదని కోర్టు తెలిపింది. భర్త సమ్మతి లేకుండా లైంగిక సంబంధానికి ఒత్తిడిచేసినా, అది అత్యాచారం లేదా అసహజ లైంగిక చర్యలుగా పరిగణించలేమని పేర్కొంది. అయితే 2017 డిసెంబర్ 11న జరిగిన ఘటన ఆధారంగా ఈ కేసు నమోదైంది.
ఒక వ్యక్తి తన భార్యతో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడి చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటి లాభం లేకపోయింది. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది. దీనికి అసహజ లైంగిక శృంగారమే కారణమని వైద్యులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలిసులు 2017 డిసెంబర్ 11న మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీనిపై విచారణ నిమిత్తం, 2019లో జగదల్‌పూర్ అదనపు సెషన్స్ కోర్టు భర్తను దోషిగా ప్రకటించి, 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
అయితే, దీనిపై భర్త హైకోర్టులో అప్పీల్ చేశాడు. తాజాగా హైకోర్టు ఈ కేసులో భర్తను నిర్దోషిగా ప్రకటించింది. దిగువ కోర్టు తీర్పును సవాలు చేస్తూ బాధితురాలి భర్త బిలాస్‌పూర్‌లోని హైకోర్టును ఆశ్రయించాడు. పీసీ 376 (అత్యాచారం), 377 (అసహజ లైంగిక చర్య) కింద నేరం అభియోగాలను కోర్టు అంగీకరించలేదు. ఈ తీర్పు సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొంతమంది హైకోర్టు తీర్పును సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది దోషికి సమర్థన కల్పించడమేనని విమర్శిస్తున్నారు. ఈ తీర్పుపై మళ్లీ సమీక్ష అవసరమని డిమాండ్ చేస్తున్నారు.