మోనాలిసా జీవితాన్ని మార్చేసిన సోషల్‌ మీడియా, సినిమాల్లోకి వచ్చి ఎంత సంపదిస్తుందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ చూసిన ఆమెనే కనిపించింది. అసలు మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోంస్లే ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ సందర్భంగా ఆమె అందం, ఆమె కళ్లతో బాగా పాపులర్ అయింది. అయితే అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే తేనె కళ్లతో ఆకట్టుకున్న మోనాలిసా అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌గా మారింది. మోనాలిసా అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

మోనాలిసా పెద్ద ఎత్తున జనాలు వెంటపడ్డారు. సెల్ఫీలు, రీల్స్‌ తీసుకుంటే తెగ సందడి చేశారు. చివరికి ఇది తన వృత్తిపై కూడా ప్రభావం పడేలా చేసింది. మహాకుంభమేళకు వచ్చే సాధారణ భక్తులకు ఇది ఇబ్బందిగా మారింది. దీంతో చేసేది ఏం లేక మోనాలిసా తన సొంతూరుకు వెళ్లిపోయింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం మోనాలిసాకు భారీగా ఫాలోయింగ్‌ పెరిగింది. రాత్రికి రాత్రి లక్షల మంది ఫాలోవర్లుగా మారిపోయారు. దీంతో ఈ క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు సినిమా వాళ్లు కూడా రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగానే మోనాలిసాతో సినిమా చేసేందుకు సనోజ్‌ మిశ్రా తన దర్శకుడు ముందుకొచ్చారు. తన తర్వాతి చిత్రంలో మోనాలిసాను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘ది డైరీ ఆఫ్‌ మణిపూర్’ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో మోనాలిసాను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అత్యంత సామాన్యురాలికి సెలబ్రిటీ స్టేటస్‌ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఈ సినిమాకు మోనాలిసా ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుందన్న దానిపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తోంది.

ఈ సినిమా కోసం మోనాలిసాకు ఏకంగా రూ. 21 లక్షల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాతో పాటు ఇతర బిజినెస్‌ ప్రమోషన్స్‌ కోసం కూడా మోనాలిసాతో కొన్ని సంస్థలు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈమెకు ఏకంగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నారని ప్రచారం నడుస్తోంది. ఏది ఏమైనా మహా కుంభమేళా పుణ్యమాని మోనాలిసా హీరోయిన్‌గా మారిపోయింది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *